క్రీడాభూమి

ఉత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో జడేజా అగ్రస్థానం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఆగస్టు 1: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో ర్యాంకులో కొనసాగుతుండగా, చటేశ్వర్ పుజారా నాలుగో స్థానంలోనూ, ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకేసారి 21 ర్యాంకులను మెరుగుపర్చుకుని 39వ స్థానంలోనూ నిలిచారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ ద్వితీయ స్థానంలోనూ, న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కాన్ విలియమ్‌సన్ తృతీయ స్థానంలోనూ నిలిచారు.
ఉత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ రెండో ర్యాంకుకు ఎగబాకాడు. ఇప్పటివరకూ రెండో స్థానంలో కొనసాగిన శ్రీలంక కెప్టెన్ రంగన హెరత్ మూడో ర్యాంకు పడిపోగా, భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 23వ ర్యాంకుకు చేరుకున్నాడు.
ఉత్తమ టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, రవీంద్ర జడేజా ద్వితీయ స్థానంలోనూ, రవిచంద్రన్ అశ్విన్ తృతీయ స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఉత్తమ బౌలర్ల జాబితాలో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 19వ ర్యాంకుకు చేరుకున్న ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అటు ఉత్తమ బ్యాట్స్‌మన్ల జాబితాలోనూ 12 ఒకేసారి ర్యాంకులు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి, ఉత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు వెర్నాన్ ఫిలాండర్‌ను అధిగమించి ఐదో స్థానానికి చేరుకున్నాడు.

చిత్రం.. భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా