క్రీడాభూమి

న్యూజిలాండ్ ఓపెన్ బాడ్మింటన్‌లో ప్రణయ్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, ఆగస్టు 1: న్యూజిలాండ్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన నాలుగో సీడ్ ఆటగాడు హెచ్‌ఎస్.ప్రణయ్‌తో పాటు 15వ సీడ్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ శుభారంభాన్ని సాధించారు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న అజయ్ జయరామ్ మాత్రం తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులను నిరాశపర్చింది. ఇటీవల యుఎస్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను కైవసం చేసుకున్న హెచ్‌ఎస్.ప్రణయ్ మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 21-14, 21-16 గేముల తేడాతో ఇండోనేషియాకు చెందిన షెసర్ హిరెన్ రుస్టావిటోను మట్టికరిపించగా, కామనె్వల్త్ క్రీడల్లో చాంపియన్‌గా నిలిచిన పారుపల్లి కశ్యప్ 21-5, 21-10 గేముల తేడాతో డియోనిసియస్ హయోం రుంబకా (ఇండోనేషియా)ను సునాయాసంగా ఓడించాడు. బుధవారం జరిగే రెండో రౌండ్‌లో పోరులో ప్రణయ్ ఇండోనేషియాకు చెందిన ఫిర్మన్ అబ్దుల్ ఖొలిక్‌తో తలపడనుండగా, కశ్యప్ న్యూజిలాండ్‌కు చెందిన ఆస్కార్ గువోతో తలపడనున్నాడు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో టోర్నీలో ప్రణయ్, కశ్యప్‌లతో పాటు భారత యువ షట్లర్లు సిరిల్ వర్మ, ప్రతుల్ జోషి, సౌరభ్ వర్మ, నీరజ్ వశిష్ఠ్, సాహిల్ సిపానీ కూడా శుభారంభాన్ని సాధించారు. ఏడో సీడ్ ఆటగాడిగా బరిలోకి దిగిన సౌరభ్ వర్మ 21-17, 21-15 గేముల తేడాతో నాథన్ టాంగ్ (ఆస్ట్రేలియా)ను మట్టికరిపించగా, 16వ సీడ్ సిరిల్ వర్మ 21-13, 21-12 తేడాతో రియాంటో సుబాగ్జా (ఇండోనేషియా)ను, ప్రతుల్ జోషి 21-10, 21-13 తేడాతో డక్సన్ వోంగ్ (న్యూజిలాండ్)ను, నీరజ్ వశిష్ఠ్ 21-8, 21-9 తేడాతో ఆండ్రూ యునాంటో (ఇండోనేషియా)ను, సాహిల్ సిపానీ 21-10, 21-10 తేడాతో జోషువా ఫెంగ్ (న్యూజిలాండ్)ను ఓడించారు. రెండో రౌండ్‌లో ప్రతుల్ చైనీస్ తైపీకి చెందిన టాప్ సీడ్ ఆటగాడు జు వెయి వాంగ్‌ను ఎదుర్కోనుండగా, నీరజ్ వశిష్ఠ్ ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ జోతోనూ, సౌరభ్ వర్మ ఇండోనేషియాకు చెందిన హెన్రికో ఖో విబోవోతూనూ, సాహిల్ సిపానీ చైనీస్ తైపీకి చెందిన 11వ సీడ్ ఆటగాడు లిన్ యు సియెన్‌తోనూ, సిరిల్ వర్మ ఇండోనేషియాకు చెందిన సపుత్ర వికీ ఆంగాతోనూ తలపడనున్నారు.
అయితే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో భారత ఆటగాడు అజయ్ జయరామ్ 19-21, 13-21 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చియా హంగ్ లూ చేతిలో ఓటమిపాలయ్యాడు. అలాగే ఈ టోర్నీలో భారత్‌కు చెందిన సిద్ధార్థ్ ఠాకూర్, సచిన్ రావత్, అరుణ్ కుమార్ అశోక్ కుమార్ పోరాటం కూడా ముగిసింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సచిన్ 12-21, 8-21 తేడాతో గియాప్ చిన్ గోహ్ (మలేషియా) చేతిలో ఓటమిపాలవగా, లీ చెయుక్ ఇయు (హాంగ్‌కాంగ్) 23-21, 21-14 తేడాతో సిద్ధార్థ్ ఠాకూర్‌ను, సపుత్ర వికీ ఆంగా (ఇండోనేషియా) 21-16, 21-12 తేడాతో అరుణ్ కుమార్ అశోక్ కుమార్‌ను ఓడించారు.
కాగా, మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన జహ్వయా వహెకిపై 14-21, 9-21 గేముల తేడాతో విజయం సాధించిన భారత క్రీడాకారిణి సన్యోగితా ఘోర్పాడే ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. న్యూజిలాండ్‌కు చెందిన జీ యోంగ్షీతో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్యోగితా 11-21, 24-22, 19-21 గేముల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆమె మెయిన్ డ్రాకు అర్హత సాధించకుండానే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

చిత్రం.. నాలుగో సీడ్‌గా బరిలో దిగిన హెచ్‌ఎస్.ప్రణయ్