క్రీడాభూమి

ఎంతో సాధించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 1: గతంలో గొప్పగొప్ప ఆటగాళ్లున్న కొన్ని టీములకన్నా ప్రస్తుతం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఎంతో ఎక్కువ సాధించిందని తాను భావిస్తున్నానని టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్ర్తీ అన్నాడు. ‘దాదాపు రెండేళ్లుగా భారత జట్టులోని ఆటగాళ్లంతా ఒకరితో ఒకరు కలిసి ఉంటున్నారు. ఇప్పుడు వారెంతో అనుభవం సంపాదించారు కూడా. చాలా భారతీయ జట్లు, చాలా మంది గొప్పగొప్ప ఆటగాళ్లు తమ కెరీర్‌లో సాధించలేనివి కూడా వారు సాధిస్తున్నారు. 2015లో శ్రీలంక గడ్డపై సిరీస్ గెలవడం దానికో ఉదాహరణ అని గురువారంనుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రవిశాస్ర్తీ అన్నాడు. 1993లో మహమ్మద్ అజరుద్దీన్ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక గడ్డపై సిరీస్ గెలుచుకున్న 22 ఏళ్ల తర్వాత కోహ్లీ సేన 2015లో ఆ ఘనతను సాధించిన విషయం తెలిసిందే. ‘చాలా మంది గొప్ప గొప్ప పేరున్న ఆటగాళ్లు 20 ఏళ్ల పాటు ఆడారు. వాళ్లు చాలా సార్లు శ్రీలంకకు వచ్చారు. అయితే వాళ్లెవరు కూడా ఇక్కడ సిరీస్ గెలవలేదు. మిగతా భారతీయ జట్లు .. అది కూడా విదేశీ గడ్డపై సాధించలేని చాలా వాటిని ఈ జట్టు సాధిస్తోంది’ అని రవిశాస్ర్తీ అన్నాడు. అయితే రవిశాస్ర్తీ వ్యాఖ్యలు ఒక విధంగా పెద్ద చర్చనే లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ ద్రవిడ్ మొదలుకొని మొన్నటి ధోనీ దాకా అనేక మంది నేతృత్వంలో టీమిండియా విదేశాల్లో సాధించిన గొప్ప విజయాలు చాలానే ఉన్నాయి.
కాగా, కెప్టెన్‌గా కోహ్లీ ఎంతో పరిణతి చెందాడని కూడా రవిశాస్ర్తీ ప్రశంసించాడు. రెండేళ్ల క్రితం తొలిసారిగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికి, ఇప్పటికి అతని బాడీ లాంగ్వేజ్‌లో చాలా మార్పు వచ్చిందని కూడా ఆయన అన్నాడు. అతని వయసుకు అతను ఎంతో సాధించాడని శాస్ర్తీ అంటూ, ఓ ఉత్తమ ఆటగాడిగా అతను నిలిచిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. కాగా, కోచ్‌గా తాను కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని, ఇంతకు ముందు అనుభవాలను ఏమీ తీసుకు రావడం లేదని శాస్ర్తీ స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో జట్టు పర్యటించనుండడం తనకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పాడు.అయితే తాను అంతదూరం ఆలోచించడం లేదని, ప్రస్తుతం శ్రీలంకపై సిరీస్‌ను నిలబెట్టుకోవడంపైనే తన దృష్టి ఉందని చెప్పాడు.
కాగా, పది నెలల క్రితం డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉండేదో తనకు తెలియదని, ఇప్పుడు మాత్రం తనకు అక్కడ పెద్దగా పనేమీ ఉండదని అనుకుంటున్నట్లు చెప్పారు. తాను మూడు సార్లు జట్టుతో ఉన్నప్పుడల్లా తన హోదా పేరు మారిందే కాని పాత్ర మాత్రం ఒక్కటేనని చెప్పాడు. అంతేకాదు 37 ఏళ్ల పాటు క్రికెట్‌తో అనుబంధం కలిగి ఉన్నప్పుడు ఎంతో కొంత నేర్చుకుని ఉంటామని, ఆటగాళ్లతో ఎలా వ్యవహరించాలో బహుశా ఆ అనుభవం తనకు ఉపయోగపడుతుందని శాస్ర్తీ అన్నాడు. బలమైన రిజర్వ్ బెంచ్ ఉండడం జట్టుకు మంచిదేనని అభిప్రాయ పడిన శాస్ర్తీ, జట్టులో స్థానం కోసం ఒకరితో ఒకరు పోటీ పడే స్థితిలో ఉండడం మంచి తలనొప్పేనని అన్నాడు. కాగా, జ్వరంనుంచి కోలుకుని తిరిగి జట్టులో చేరిన ఓపెనర్ కెఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నాడని, అతడ్ని తాము దగ్గరగా గమనిస్తున్నామని కూడా శాస్ర్తీ చెప్పాడు.