క్రీడాభూమి

విజృంభించిన పుజారా, రహానే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 3: శ్రీలంకతో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా గురువారం ఇక్కడ ప్రారంభమైన రెండో మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా వరుసగా మరో సొగసైన అజేయ శతకంతో విజృంభించి ఎర్ర బంతి క్రికెట్ పట్ల తనకు గల మక్కువను చాటుకున్నాడు. అతనికి తోడుగా సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానే కూడా అజేయ శతకంతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 344 పరుగులు సాధించిన భారత జట్టు మరోసారి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్ 56 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం ధావన్ (35) దిల్‌రువన్ పెరీరా బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించగా, అర్ధ శతకం సాధించిన లోకేష్ రాహుల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 109 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఈ తరుణంలో ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి రంగన హెరత్ బౌలింగ్‌లో ఏంజెలో మాథ్యూస్‌కు దొరికిపోయాడు. అయితే అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అజింక్య రహానే క్రీజ్‌లో నిలదొక్కుకుని పుజారాకు చక్కటి సహకారాన్ని అందించాడు. దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్న పుజారా 112 బంతుల్లో అర్ధ శతకాన్ని రాబట్టుకోగా, దూకుడుగా ఆడిన రహానే 83 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత సమన్వయంతో ఆడుతూ శ్రీలంక బౌలర్లను ప్రతిఘటించిన వీరు చెరో శతకాన్ని నమోదు చేసుకుని స్కోరు బోర్డును మందుకు నడిపారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పుజారా (128), రహానే (103) అజేయంగా 211 భాగస్వామ్యాన్ని అందించడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు సాధించింది. టెస్టుల్లో పుజారాకు ఇది 13వ శతకం కాగా, రహానేకి 9వ సెంచరీ.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ ఎల్‌బిడబ్ల్యు (బి) దిల్‌రువన్ పెరీరా 35, లోకేష్ రాహుల్ రనౌట్ (చండీమల్/డిక్వెల్లా) 57, ఛటేశ్వర్ పుజారా నాటౌట్ 128, అజింక్యా రహానే నాటౌట్ 103, ఎక్స్‌ట్రాలు: (బైస్ 4, లెగ్ బైస్ 3, నోబాల్ 1) 8, మొత్తం: 90 ఓవర్లలో 344/3.
వికెట్ల పతనం: 1-56, 2-109, 3-133.
బౌలింగ్: నువాన్ ప్రదీప్ 17.4-2-63-0, రంగన హెరత్ 24-3-83-1, దైముత్ కరుణరత్నే 3-0-10-0, దిల్‌రువన్ పెరీరా 18-2-68-1, మలింద పుష్పకుమార 19.2-0-82-0, ధనంజయ డిసిల్వా 8-0-31-0.

చిత్రం.. ఛటేశ్వర్ పుజారా (128-నాటౌట్)