క్రీడాభూమి

‘ఖేల్ రత్న’ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: క్రీడారంగంలో అద్భుత ప్రదర్శనకు గాను ఇచ్చే దేశ అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్ రత్న’ అవార్డు కోసం పారాలింపియన్ దేవేంద్ర ఝజరియా, ప్రముఖ హాకీ క్రీడాకారుడు సర్దార్ సింగ్ పేర్లను సిఫార్సు చేశారు. పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన ఝజారియా ఈ అవార్డుకోసం తమ తొలి చాయిస్ అని కూడా రిటైర్డ్ న్యాయమూర్తి సికె ఠక్కర్ నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ తెలిపింది. కాగా, ఖేల్ రత్న అవార్డు కోసం తన రెండో నామినీగా 31 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ సర్దార్ సింగ్‌ను ఎంపిక చేసిన కమిటీ ఈ ఇద్దరి పేర్లను అవార్డు కోసం పరిశీలించాలని సూచించడం గమనార్హం. 36 ఏళ్ల ఝజరియా సాధించిన రెండు బంగారు పతకాలు 2004లో జరిగిన ఏథెన్స్ గేమ్స్, గత ఏడాది రియోలో జరిగిన పారాలింపిక్స్‌లో వచ్చాయి. ఈ రెండు సందర్భాల్లోను ఆయన సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. 2013లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కూడా ఆయన స్వర్ణ పతకం సాధించాడు. ఒక వేళ ఝజరియాను ఖేల్ రత్న అవార్డు వరిస్తే ఈ పురస్కారం లభించిన తొలి పారాలింపియన్ అవుతాడు. 12 ఏళ్ల క్రితం ఏథెన్స్‌లో స్వర్ణ పతకం సాధించినప్పుడే తనకు ఈ అవార్డు వచ్చి ఉండాల్సిందని, ఎందుకు రాలేదో తనకు తెలియదని, ఇప్పటికయినా క్రీడాశాఖ తన శ్రమను గుర్తించినందుకు సంతోషంగా ఉందని జైపూర్‌నుంచి పిటిఐతో మాట్లాడుతూ ఝజరియా అన్నారు.
కాగా ప్రపంచ హాకీలో అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన 31 ఏళ్ల సర్దార్ సింగ్ 2008లో సుల్తాన్ అజ్లాన్‌షా కప్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ద్వారా జాతీయ జట్టుకు నాయకత్వం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న సర్దార్ ఖాతాలో రెండు ఆసియా గేమ్స్ పతకాలు-2014 ఇంచెయాన్‌లో స్వర్ణం, 2010 గ్వాంగ్‌ఝులో కాంస్యపతకం- ,రెండు కామనె్వల్త్ గేమ్స్ రజత పతకాలు ఉన్నాయి. గత 15-20 ఏళ్లుగా తాను చేసిన కఠోర శ్రమకు ఇప్పుడు ఫలితం లభించిందని సర్దార్ అంటూ, అయితే ఈ ఘనత తన జట్టు సహచరులకే దక్కుతుందని, ఎందుకంటే వారే లేకుంటే తాను ఇవన్నీ సాదించి ఉండే వాడిని కాదని అన్నాడు. కాగా, ఝజరియా, సర్దార్ సింగ్ ఇద్దరికీ ‘ఖేల్ రత్న’ అవార్డు లభిస్తుందా లేక ఇద్దరిలో ఒకరికే దక్కుతుందా అనేది మరికొద్ది రోజుల్లోనే క్రీడల శాఖ నిర్ణయించనుంది.
ఈ ఇద్దరూ కాకుండా అర్జున అవార్డుల కోసం 17 మంది క్రీడాకారుల పేర్లను కూడా సెలెక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. జాతీయ క్రికెట్ జట్టులో రెగ్యులర్‌గా స్థానం పొందుతున్న ఛటేశ్వర్ పుజారా, ఇటీవల ప్రపంచ మహిళా క్రికెట్ కప్ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో రాణించిన భారత మహిళా జట్టు సభ్యురాలు హర్మన్‌ప్రీత్ కౌర్, పారాలింపిక్ పతక విజేతలు మరియప్పన్ తంగవేలు, వరుణ్ భాటి, గోల్ఫ్ క్రీడాకారుడు ఎస్‌ఎస్‌పి చౌరాసియా, టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని, హాకీ ఆటగాడు ఎస్‌వి సునీల్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంకలో 50వ టెస్టు ఆడుగుతున్న 29 ఏళ్ల పుజారా గత ఏడాది ఒకే సీజన్‌లో 1350కుపైగా పరుగులు సాధించడమే కాకుండా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకన్నా ఎక్కువ పరుగులు సాధించాడు. మరియప్పన్, భాటి ఇద్దరూ రియోలో జరిగిన పారాలింపిక్స్‌లో హైజంప్‌లో స్వర్ణ, రజత పతకాలను సాధించారు.

చిత్రాలు.. దేవేంద్ర ఝజరియా , సర్దార్ సింగ్