క్రీడాభూమి

డోపింగ్ పరీక్షలో పట్టుబడిన ఎరానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, ఆగస్టు 7: ఇటలీకి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నీ మాజీ ఫైనలిస్టు సరా ఎరానీ (30) డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. పురుష హార్మోన్ ‘టెస్టోస్టిరాన్’ను ఉనికిని గోప్యంగా ఉంచేందుకు ఉపయోగించే హార్మోన్ పరీక్షలో ఆమె విఫలమైందని ఇటలీ వార్తా పత్రికలు సోమవారం వెల్లడించాయి. డోపింగ్ పరీక్షల్లో భాగంగా ఫిబ్రవరి నెలలో ఎరానీకి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) మూత్ర పరీక్షలు నిర్వహించగా, రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే అనస్ట్రోజోల్ హార్మోన్ అవశేషాలు బయల్పడ్డాయని, పురుష హార్మోన్‌కు మరుగుపరిచేందుకు (మాస్కింగ్ ఏజెంట్‌గా) కూడా అనస్ట్రోజోల్ ఉపయోగపడుతుందని ‘గెజెట్టా డెల్లో స్పోర్ట్’, ‘కొరియెరె డెల్లా సెరె’ పత్రికలు వెల్లడించాయి.
ఫ్రెంచ్ ఓపెన్ 2012 ఎడిషన్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న ఎరానీ టైటిల్ పోరులో ఓటమిపాలైంది. అయినప్పటికీ ఆ మరుసటి సంవత్సరం ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి దూసుకెళ్లింది. కెరీర్‌లో ఎరానీకి ఇదే అత్యుత్తమ ర్యాంకు. ఆ తర్వాత నుంచి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో క్రమంగా పతనమైన ఎరానీ ప్రస్తుతం 98వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఎరానీ కెనడాలో ఆడాల్సి ఉన్నప్పటికీ డోపింగ్ వ్యవహారంపై ఐటిఎఫ్ బహిరంగ ప్రకటన చేయడానికి ముందే తన వాదన వినిపించేందుకు ఇటలీకి తిరిగివచ్చింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో నాలుగుసార్లు పతకాలు సాధించిన ఇటలీ రోయర్ నికోలో మొర్నాటీ కూడా గత ఏడాది ఇదే పరీక్షలో పట్టుబడ్డాడు.

చిత్రం.. ఇటలీ టెన్నిస్ క్రీడాకారిణి సరా ఎరానీ