క్రీడాభూమి

ఎదురు చూస్తున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, ఆగస్టు 7: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) స్పాట్-్ఫక్సింగ్ వ్యవహారంలో తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని తొలగించాలని కేరళ హైకోర్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ఆదేశించడం పట్ల శ్రీశాంత్‌తో పాటు అతని భార్య భువనేష్ కుమారి హర్షాన్ని వ్యక్తం చేశారు. ‘ఇది ఎంతో మంచి వార్త. హైకోర్టు తీర్పు నాకు ఎంతో ఊరటనిచ్చింది. దీంతో మళ్లీ క్రికెట్ మైదానంలోకి దిగేందుకు నేను ఎదురు చూస్తున్నా’ అని శ్రీశాంత్ స్పష్టం చేశాడు. కాగా, శ్రీశాంత్ అన్నింటి కంటే ఎక్కువగా ఆరాధించేది క్రికెట్‌నేనని, హైకోర్టు తీర్పుతో అతను మళ్లీ మైదానంలోకి దిగి ఔట్ స్వింగర్లతో మరోసారి ప్రత్యర్థులపై గర్జించాలని ఆకాంక్షిస్తున్నానని భువనేష్ కుమారి తెలిపింది. ఇదిలావుంటే, శ్రీశాంత్‌పై నిషేధాన్ని తొలగించాలని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెసిఎ) అభినందించింది. ‘శ్రీశాంత్ మా సొంత ఆటగాడు. అందుకే అతనికి ఎప్పుడూ అండగా నిలిచాం. శ్రీశాంత్‌ను మళ్లీ మైదానంలోకి దింపే విషయమై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటాం’ అని కెసిఎ అధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఒక మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్పిన్నర్ హర్భజన్ చేతిలో చెంపదెబ్బ తిన్న శ్రీశాంత్ తన కెరీర్‌లో ఇప్పటివరకూ 27 టెస్టు మ్యాచ్‌లలో 87 వికెట్లు, అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లలో 75 వికెట్లు సాధించాడు.