క్రీడాభూమి

రవీంద్రుడే నెం.1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఆగస్టు 8: ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత ఆటగాడు రవీంద్ర జడేజా ఇప్పుడు ఉత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలోనూ నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో అతను బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను కిందికి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుత టాప్-10 ఆల్‌రౌండర్ల జాబితాలోని ఆటగాళ్లలో షకీబ్ అల్ హసన్ మొత్తం 431 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి దిగజారగా, రవీంద్ర జడేజా ఖతాలో 428 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
కాగా, ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో టీమిండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారా (888 రేటింగ్ పాయింట్లు) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (813 పాయింట్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో నిలువగా, ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అయితే భారత ఆటగాడు అజింక్యా రహానే (778 పాయింట్లు) ఈ జాబితాలో ఒకేసారి ఐదు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు దూసుకెళ్లగా, ఓపెనర్ లోకేష్ రాహుల్ (737 పాయింట్లు) 11వ ర్యాంకులో నిలిచాడు.
శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా కొలంబోలో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో జడేజా మరోసారి ఉత్తమ ఆల్‌రౌండ్ రౌండ్ ప్రదర్శనతో రాణించడం తాజా ర్యాంకింగ్స్‌లో అతను ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఊతమిచ్చింది. ఈ మ్యాచ్‌లో జడేజా 70 పరుగుల అజేయ స్కోరు సాధించడంతో పాటు ఏడు వికెట్లు కైవసం చేసుకుని భారత జట్టు ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయభేరి మోగించడంలో కీలకపాత్ర పోషించిన విషయం విదితమే. అయితే ఇదే మ్యాచ్‌లో జడేజా ఐసిసి నిబంధనలను అతిక్రమించడంతో అతడిని ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేయనున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో జడేజా మరోసారి తన ప్రతిభను చాటు కోవడంతో ఉత్తమ బ్యాట్స్‌మన్ల జాబితాలో కూడా అతను ఒకేసారి తొమ్మిది స్థానాలు ఎగబాకి 51వ స్థానానికి చేరుకోగా, టీమిండియా వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా 4 స్థానాలను మెరుగుపర్చుకుని 44వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఉత్తమ బ్యాట్స్‌మెన్ జాబితాలో వృద్ధిమాన్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు.
అయితే ఉత్తమ బౌలర్ల జాబితాలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానం కిందికి దిగజారి మూడో ర్యాంకుకు పడిపోయాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజాకు దిగువన జిమీ ఆండర్సన్ రెండో స్థానంలో నిలువగా, భారత పేసర్లు మహమ్మద్ షమీ (20వ స్థానం), ఉమేష్ యాదవ్ (22వ స్థానం) కూడా తాజా ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ పురోగతి సాధించారు. దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లో ముగిసిన చివరి మ్యాచ్‌లో చక్కగా రాణించి ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ మొరుూన్ అలీ ఉత్తమ బ్యాట్స్‌మెన్ జాబితాలో 21వ స్థానానికి, ఉత్తమ బౌలర్ల జాబితాలో 18వ స్థానానికి, ఉత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో 250 పరుగులు, 25 వికెట్లు రాబట్టుకున్న తొలి ఆటగాడిగా ఆవిర్భవించడం తాజా ర్యాంకింగ్స్‌లో అతని ఎదుగుదలకు ఎంతగానో దోహదపడింది.