క్రీడాభూమి

ఒంటరి పరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 10: ఫైనల్‌కు అర్హత కోసం నిర్వహించే హీట్స్‌లో ఒకే ఒక అథ్లెట్ పరుగు తీసిన అరుదైన సంఘటన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో చోటు చేసుకుంది. ఏ విభాగంలోనైనా ముందుగా క్వాలిఫయింగ్ రౌండ్స్‌ను నిర్వహిస్తారు. వీటినే హీట్స్ అంటారు. అథ్లెట్ల సంఖ్యను బట్టి హీట్స్ సంఖ్య ఉంటుంది. పురుషుల 200 మీటర్ల ఈవెంట్‌లో, అన్ని హీట్స్‌లో కలిపి మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన అథ్లెట్లకు ఫైనల్‌లో చోటు దక్కుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఇదే విభాగంలో హీట్స్‌ను నిర్వహించగా, బోస్వానాకు చెందిన ఇసాక్ మక్వాలా హాజరుకాలేకపోయాడు. అరుదైన వైరస్ సోకడంతో, అది ఇతరులకు కూడా వ్యాపిస్తుందనే ఉద్దేశంతో అధికారులు అతనిని మిగతా పోటీదారులతో కలపలేదు. రెగ్యులర్ హీట్స్ ముగిసిన తర్వాత, అతనికి మాత్రమే ప్రత్యేకంగా అర్హతా పోటీని నిర్వహించారు. అధికారుల ప్రవర్తన మక్వాలాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ట్రాక్ వన్‌పై అతను ఒంటరిగా పరుగెత్తాడు. 200 మీటర్ల దూరాన్ని పూర్తి చేసినప్పటికీ, ఆగకుండా మరోసారి అంతే దూరాన్ని పరిగెత్తాడు. 20.14 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసిన కారణంగా ఫైనల్‌కు అర్హత సంపాదించాడు. కానీ, తనను వెలివేయడం, ఒంటరిగా పరిగెత్తించడం ఎంతో బాధించిందని మక్వాలా వాపోయాడు. అధికారుల తీరు తనకు కోపం తెప్పించిందని, అదే సమయంలో మానసిక క్షోభకు గురయ్యానని అతను చెప్పాడు. లోలోపల కుంగిపోతూనే తాను రేస్‌ను పూర్తి చేశానని అన్నాడు. మొత్తం మీద ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఈ విధంగా ఒక అథ్లెట్‌కు ప్రత్యేకంగా హీట్స్‌ను నిర్వహించడం చర్చనీయాంశమైంది.