క్రీడాభూమి

వాన్ నికెర్క్ ఆశలపై గలియెవ్ నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 11: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 200, 400 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధించిన రెండో అథ్లెట్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాలనుకున్న దక్షిణాఫ్రికా రన్నర్ వేడ్ వాన్ నికెర్క్ ఆశలపై టర్కీకి చెందిన రమిల్ గలియెవ్ నీళ్లు చల్లాడు. ఇప్పటికే 200 మీటర్ల పరుగులో టైటిల్ సాధించిన వాన్ నికెర్క్, 400 మీటర్ల పోరులో ఫేవరిట్‌గా బరిలోకి దిగాడు. 1995లో గొటెబర్గ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో మైఖేల్ జాన్సన్ 200, 400 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలను సాధించి నెలకొల్పిన రికార్డును సమం చేస్తాడని అంతా ఊహించారు. కానీ, ‘అండర్ డాగ్’ గలియెవ్ అతని కంటే 0.2 సెకను ముందుగా లక్ష్యాన్ని చేరి, అందరికీ షాకిచ్చాడు. అతను 20.09 సెకన్లలో రేస్‌ను పూర్తి చేయగా, వాన్ నికెర్క్ 20.11 సెకన్లలో ఫినిషింగ్ లైన్‌ను దాటాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన జెరీమ్ రిచర్డ్స్ 20.11 సెకన్లతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
ట్రిపుల్ జంప్ విజేత టేలర్
పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో క్రిస్టియన్ టేలర్ (అమెరికా) విజేతగా నిలిచాడు. అతను 17.68 మీటర్ల దూరానికి లంఘించి టైటిల్ అందుకున్నాడు. అతని సహచరుడు విల్ క్లే 17.63 మీటర్లతో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించగా, పోర్చుగల్ అథ్లెట్ నీల్సన్ ఎవోరా 17.19 మీటర్ల దూరాన్ని పూర్తి చేసి కాంస్య పతకాన్ని సాధించాడు.

చిత్రం.. మైఖేల్ జాన్సన్ రికార్డును సమం చేసే అవకాశాన్ని కోల్పోయన వాన్ నికెర్క్ దిగ్భ్రాంతి. 400 మీటర్ల పరుగులో ఫేవరిట్‌గా దిగిన అతను ద్వితీయ స్థానంతో సంతృప్తి చెందాడు