క్రీడాభూమి

కాంగ్ రికార్డు త్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 11: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా దవీందర్ సింగ్ కాంగ్ రికార్డు సృష్టించాడు. ఇదే ఈవెంట్‌లో అద్భుతాలు సృష్టిస్తాడనుకున్న నీరజ్ చోప్రా క్వాలిఫయింగ్ రౌండ్ నుంచే వెనుదిరిగాడు. ఫైనల్ చేరేందుకు కనీసం దూరాన్ని 83 మీటర్లుగా నిర్ధారించారు. కాంగ్ మొదటి ప్రయత్నంలో 82.22 మీటర్లకు విసిరితే, రెండో ప్రయత్నంలో 82.14 మీటర్లే అందుకోగలిగాడు. అయితే, చివరిదైన మూడో ప్రయత్నంలో 84.22 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరి, ఫైనల్‌లో స్థానం దక్కించుకున్నాడు. గ్రూప్ ‘ఎ’ నుంచి ఐదుగురు, గ్రూప్ ‘బి’ నుంచి ఏడుగురు చొప్పున మొత్తం 13 మంది జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఫైనల్‌లోకి అడుగుపెట్టారు. శనివారం జరిగే తుది పోరులో కాంగ్ ఏ విధంగా రాణిస్తాడన్నది ఆసక్తి రేపుతున్నది. ఇలావుంటే, 19 ఏళ్ల సంచలన జావెలిన్ త్రోయర్ నీరజ్ మొదటి ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. రెండో ప్రయత్నంలో 80.54 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరిన అతను చివరి, మూడో ప్రయత్నంలో 82.26 మీటర్లను అందుకున్నాడు. కానీ, నిబంధనలను అనుసరించి అతను ఫైనల్‌కు క్వాలిఫై కాలేదు.
కోచ్ లేకుండానే..
ప్రపంచ అథ్లెటిక్స్‌లో పోటీపడే వారికి సహజంగానే కోచ్‌ల మార్గదర్శకం ఉంటుంది. కానీ, కాంగ్‌కు కోచ్ లేడు. సలహాలు, సూచనలు ఇచ్చేవారే కనిపించలేదు. దీనితో అతను తన పోటీదారులనే ఆశ్రయంచాడు. వారి నుంచి కొన్ని కీలక అంశాలను నేర్చుకున్నాడు.

చిత్రం.. దవీందర్ సింగ్ కాంగ్