క్రీడాభూమి

నన్ను క్షమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: అమెరికా బాస్కెట్‌బాల్ స్టార్ కెవిన్ డ్యూరాంట్ వెనక్కు తగ్గాడు. భారత్ 20 సంవత్సరాలు వెనుకబడి ఉందని చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు తెలిపాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డ్యూరాంట్ మాట్లాడుతూ బాస్కెట్‌బాల్ క్రీడలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ రెండు దశాబ్దాలు వెనుకబడిందని ఎద్దేవా చేశాడు. అనుభవం, ప్రావీణ్యం వంటి అంశాల్లో అమెరికా వంటి దేశాల దరిదాపుల్లోకి కూడా భారత్ రాలేదని వ్యాఖ్యానించాడు. అయితే, సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంతో అతను జరిగిన పొరపాటును తెలుసుకున్నాడు. దిద్దుబాటు చర్యలను చేపట్టాడు. అందులో భాగంగానే, తనకు భారత్‌ను కించపరిచే ఉద్దేశం లేదన్నాడు. తనను భారతీయులు క్షమించాలని కోరాడు.