క్రీడాభూమి

కడ వరకూ ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: మహిళల 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రేస్ కడ వరకూ ఉత్కంఠ రేపింది. ఒక్కోసారి ఒక్కో అథ్లెట్ ముందుకు దూసుకెళ్లడంతో, ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కెన్యా, అమెరికా అథ్లెట్ల మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొంది. అందరి కంటే ముందుగా లక్ష్యాన్ని చేరాలన్న పట్టుదలతో ప్రతి ఒక్కరూ సర్వశక్తులు ఒడ్డారు. అయితే, చివరి క్షణాల్లో అమెరికా ఆధిపత్యాన్ని సంపాదించగా, కెన్యా వెనుకబడింది. ఎమ్మా కోబర్న్ 9 నిమిషాల 02.58 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి, స్వర్ణ పతకం సాధించింది. ఆమె సహచర అథ్లెట్ కొట్నీ ఫ్రేరిచెస్ 9 నిమిషాల, 03.77 సెకన్లతో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. చివరి వరకూ గట్టిపోటీనిచ్చిన కెన్యా స్టార్ హివిన్ జెక్కెమోల్ 9 నిమిషాల, 04.03 నిమిషాలతో కాంస్య పతకాన్ని అందుకుంది.

చిత్రం.. మహిళల 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో లక్ష్యం దిశగా దూసుకెళుతున్న
అమెరికా అథ్లెట్ ఎమ్మా కోబర్న్ (కుడి)