క్రీడాభూమి

ధోనీ విఫలమైతే ప్రత్యామ్నాయాలు అనే్వషిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, ఆగస్టు 14: శ్రీలంకతో జరిగే వనే్డ సిరీస్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విఫలమైతే, తప్పకుండా ప్రత్యామ్నాయాలను అనే్వషిస్తామని జాతీయ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. సోమవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ధోనీ ఎంపికను సమర్ధించుకున్నాడు. అనుభవజ్ఞుడైన ఆటగాళ్ల అవసరం జట్టుకు ఉందన్నాడు. ఒకవేళ ధోనీ విఫలమైతే, ఆ స్థానాన్ని భర్తీ చేయడం గురించి ఆలోచిస్తామని చెప్పాడు. కొంత మంది వయసు మీద పడుతున్నకొద్దీ మరింత మెరుగైనా ఆటతో రాణిస్తారని వ్యాఖ్యానించాడు. అండ్రీ అగస్సీ 30 ఏళ్ల తర్వాతే చిరస్మరణీయ విజయాలను సాధించాడని అన్నాడు.
ఐదు నెలల్లో స్పష్టత
వచ్చే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆడే జట్టు ఏ విధంగా ఉంటుందనే విషయంపై మరో ఐదు నెలల్లో స్పష్టత వస్తుందని ఎమ్మెస్కే అన్నాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నామని అన్నాడు. సీనియర్లు, యువ ఆటగాళ్ల మేలి కలయికగా జట్టు ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పాడు.
కపిల్‌తో హార్దిక్‌ను పోలుస్తారు
భారత జట్టులో పేసర్ ఆల్‌రౌండర్‌గా తన స్థానాన్ని స్థిరం చేసుకుంటున్న హార్దిక్ పాండ్యపై ఎమ్మెస్కే ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్తులో అతనిని ప్రజలంతా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో పోలుస్తారని జోస్యం చెప్పాడు. ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతూ టి-20 స్పెషలిస్టుగా జాతీయ సెలక్టర్లను ఆకట్టుకున్న హార్దిక్ శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి, ఈ ఫార్మాట్‌లోనూ రాణించే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. జాతీయ జట్టులో ఫాస్ట్ బౌలింగ్ చేసే సమర్థుడైన ఆల్‌రౌండర్ లేడనుకుంటున్న సమయంలో హార్దిక్ ఆ లోటును భర్తీ చేస్తున్నాడని ఎమ్మెస్కే ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇదే విధంగా అతను ఆడితే, కపిల్‌ను తలపిస్తాడని కొనియాడాడు.

చిత్రం.. క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్