క్రీడాభూమి

శ్రీలంకలో భారత స్వాతంత్య్ర వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లెకల్, ఆగస్టు 15: ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు మంగళవారం అక్కడ దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. జట్టు సభ్యులందరి సమక్షంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు. తన తండ్రి కూడా ఆగస్టు 15వ తేదీనే జన్మించారని, కనుక చిన్ననాటి నుంచే తనకు ఇది ఎంతో ప్రత్యేకమైన రోజని కోహ్లీ పేర్కొన్నాడు. ‘్భరతీయుడిగా పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. ప్రత్యేకించి స్వాతంత్య్ర దినోత్సవం నాడు నాలో ఈ అనుభూతి మరింత పెరుగుతోంది’ అని కోహ్లీ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
అఫ్రిదీ శుభాకాంక్షలు
కాగా, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షహీద్ అఫ్రిదీ మన దేశానికి శుభాకాంక్షలు తెలిపాడు. శాంతి, సహనం కోసం ఇరు దేశాలు కలసికట్టుగా కృషి చేయాలని అతను విజ్ఞప్తి చేశాడు. పాక్‌లో అఫ్రిదీ నిర్వహిస్తున్న ఒక ఫౌండేషన్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బహూకరించిన విషయం తెలిసిందే. దీంతో అఫ్రిదీ ఇటీవల కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు. అఫ్రిదీ గత ఏడాది ఏప్రిల్ నెలలో క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పుడు అతనికి కోహ్లీ సేన తమ సంతకాలతో కూడిన జెర్సీని కూడా బహూకరించింది.