క్రీడాభూమి

సింధు, శ్రీకాంత్‌పైనే ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముల్హెమ్ ఆన్ డెర్ రర్ (జర్మనీ): స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఫిట్నెస్ కారణంగా వైదొలగ్గా, మంగళవారం నుంచి ప్రారంభం కాన్న జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నీలో భారత అభిమానులంతా పివి సింధు, కిడాంబి శ్రీకాంత్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. సైనాను కాలి గాయం తీవ్రంగా వేధిస్తున్నది. ఆల్ ఇంగ్లాండ్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఆమె జర్మనీ ఓపెన్‌కు హాజరుకాలేదు. ఆమె బరిలో లేనికారణంగా భారత్ టైటిల్ వేటను కొనసాగించే బాధ్యత సింధుపై పడింది. ఈ ఏడాది ఆరంభంలో మలేసియా మాస్టర్స్ టైటిల్‌ను గెల్చుకున్న సింధు తర్వాత అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నది. దక్షిణ ఆసియా గేమ్స్‌లో ఆమె తన సహచర క్రీడాకారిణి రుత్విక శివానీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. ఆసియా చాంపియన్‌షిప్ చాంపియన్‌షిప్‌లో సింధుపై నజోమీ ఒకుహరా (జపాన్), జి హ్యున్ సంగ్ (కొరియా) విజయాలను నమోదు చేశారు. సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రీ రెండో రౌండ్‌లో నిచావొన్ జిందాపొల్‌ను ఢీకొని ఓటమిపాలైంది. అయితే, ఆ పరాజయాలను గురించి ఆలోచించకుండా జర్మన్ ఓపెన్‌కు సిద్ధమైనట్టు చెప్తున్న సింధు తన తొలి రౌండ్‌లో రోంగ్ షాపర్ (అమెరికా)తో తలపడుతుంది.
పురుషుల సిగిల్స్‌లో పోటీపడుతున్న కిడాంబి శ్రీకాంత్ గత నెలే సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. అంతేగాక, ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతను జర్మన్ ఓపెన్ తొలి రౌండ్‌లో జపాన్ క్రీడాకారిణి తకుమా ఉయేదాను ఢీ కొంటాడు.
భారత్ తరఫున బరిలో ఉన్న వారిలో సమీర్ వర్మ మొదటి రౌండ్‌ను ఉక్రెయికు చెందిన డిమిత్రో జవాడ్‌స్కీతో ఆడతాడు. 11వ సీడ్ పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్‌లో ఉక్రెయిన్‌కే చెందిన అర్టెమ్ పొచ్‌తరెవ్‌తో తలపడతాడు. కాగా, అజయ్ జయరామ్, సాయి ప్రణీత్, హెచ్‌ఎస్ ప్రణయ్ ఈ ఈవెంట్ నుంచి వైదొలిగారు. కాగా, పురుషుల డబుల్స్‌లో మనూ అత్రి, సుమీత్ రెడ్డి జోడీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

భారత్‌కు మహిళల సింగిల్స్ టైటిల్ అందించే సత్తా ఉన్న పివి సింధు