క్రీడాభూమి

పతకమే సాక్షి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, ఆగస్టు 20: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని సాధించడమే లక్ష్యంగా భారత స్టార్ రెజ్లర్, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ పోటీలకు సిద్ధమైంది. రియోలో 58 కిలోల విభాగంలో పతకాన్ని సాధించిన సాక్షి ఆతర్వాత 60 కిలోల విభాగానికి మారింది. ఈ ఏడాది మే మాసంలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్స్‌లో 60 కిలోల విభాగంలోనే రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో అదే కేటగిరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమెకు పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకుల అంచనా.
కాగా, రియో ఒలింపిక్స్‌లో 48 కిలోల విభాగంలో సవాలు విసిరినప్పటికీ, కాలి గాయం కారణంగా బౌట్‌ను అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోయిన వినేష్ ఫొగత్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో 55 కిలోల విభాగంలో పోటీపడి రజత పతకాన్ని సాధించింది. అయితే, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తిరిగి 48 కిలోల విభాగం నుంచి పోటీపడాలని 22 ఏళ్ల వినేష్ నిర్ణయించుకుంది. ఆమెను మినహాయిస్తే ఫొగత్ కుటుంబంలోని అక్కాచెల్లెళ్లలో ఎవరూ ఈ మెగా టోర్నీకి హాజరుకావడం లేదు. గీత, బబిత అసలు ట్రయల్స్‌లోనే పాల్గొనలేదు. కాగా, రీతూ, సంగీత ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సంపాదించలేకపోయారు.
భజరంగ్‌పై ఆశలు
పురుషుల విభాగంలో భజరంగ్ పునియా భారత్‌కు పతకాన్ని అందిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచిన అతను, 2013 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. అప్పటి కంటే ఇప్పుడు మెరుగైన ప్రదర్శనతో రాణిస్తాడన్న నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతున్నది. బుడాపెస్ట్‌లో 60 కిలోల విభాగంలో పోటీపడిన అతను ఈసారి 65 కిలోల విభాగానికి మారాడు. ఆసియాలోనే అత్యుత్తమ రెజ్లర్‌గా పేరు సంపాదించిన అతను పారిస్‌లో విజేతగా నిలిచే అవకాశాలు లేకపోలేదు. ఈనెల 12న జరిగిన ప్రత్యేక సెలక్షన్ ట్రయల్‌లో రాహుల్ మాన్‌ను 10-0 తేడాతో చిత్తుచేసి, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సంపాదించిన అతను దేశ ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను ఎంత వరకూ నిలబెడతాడో చూడాలి. కాగా, 57 కిలోల విభాగంలో ఒలింపియన్ సందీప్ తోమర్, 70 కిలోల విభాగంలో అమిత్ ధంకర్, 74 కిలోల విభాగంలో ప్రవీణ్ రాణా తదితరులు పతకాలపై ఆశలు పెంచుతున్నారు.
ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొంటున్న భారత జట్టు:
పురుషుల ఫ్రీస్టయిల్: సందీప్ తోమర్ (57 కిలోలు), హర్పూల్ (61 కిలోలు), భజరంగ్ పునియా (65 కిలోలు), అమిత్ ధంకర్ (70 కిలోలు), ప్రవీణ్ రాణా (74 కిలోలు), దీపక్ (86 కిలోలు), సత్యవర్త్ కడియన్ (97 కిలోలు), సుమీత్ (125 కిలోలు).
మహిళల రెజ్లింగ్: వినేష్ ఫొగత్ (48 కిలోలు), శీతల్ (53 కిలోలు), లలిత (55 కిలోలు), పూజా ధండా (58 కిలోలు), సాక్షి మాలిక్ (60 కిలోలు), శిల్పి (63 కిలోలు), నవ్‌జోత్ కౌర్ (69 కిలోలు), పూజ (75 కిలోలు).
గ్రీకో-రోమన్: జ్ఞానేందర్ (59 కిలోలు), రవీందర్ (66 కిలోలు), యోగేష్ (71 కిలోలు), గుర్‌ప్రీత్ సింగ్ (75 కిలోలు), హర్‌ప్రీత్ సింగ్ (80 కిలోలు), రవీందర్ ఖత్రి (85 కిలోలు), హర్దీప్ (98 కిలోలు), నవీన్ (130 కిలోలు).