క్రీడాభూమి

బ్రాడ్ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడ్జిబాస్టన్: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టువర్ట్ బ్రాడ్ విజృంభణ ఇంగ్లాండ్ విజయంలో కీలకంగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన బ్రాడ్ రెండో ఇన్నింగ్స్‌లో 34 పరుగులకే మూడు వికెట్లు కూల్చాడు. ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇయాన్ బోథంను మూడో స్థానానికి నెట్టి, రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు చొప్పున వికెట్లు సాధించిన జేమ్స్ ఆండర్సన్ 127 టెస్టుల్లో 492 వికెట్లతో ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. తన 107వ టెస్టు ఆడిన బ్రాడ్ 384 వికెట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. 102 టెస్టుల్లో 383 వికెట్లు పడగొట్టిన బోథం రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. ఇలావుంటే, ఆండర్సన్ ఆల్‌టైం గ్రేట్ టెస్టు బౌలర్ల జాబితాలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నాడు. ముత్తయ్య ముళీధరన్ 800 వికెట్లు (133 టెస్టులు) సాధించి, అగ్రస్థానంలో నిలిచాడు. షేన్ వార్న్ 149 మ్యాచ్‌ల్లో 708, అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు కూల్చి, వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. గ్లేన్ మెక్‌గ్రాత్ 124 టెస్టుల్లో 563 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో ఉండగా, 132 టెస్టుల్లో 519 వికెట్లు సాధించిన కొట్నీ వాల్ష్‌ది ఐదో స్థానం.