క్రీడాభూమి

బార్సిలోనా శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, ఆగస్టు 21: స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగాలో 25వ టైటిల్ కోసం పోటీపడుతున్న బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ శుభారంభం చేసింది. రియల్ బెటిస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ని 2-0 తేడాతో గెల్చుకుంది. ఆరంభంలో ఎంతో జాగ్రత్తగా ఆడుతూ, ప్రత్యర్థికి దాడిచేసే అవకాశం ఇవ్వని బార్సిలోనాకు 36వ నిమిషంలో తొలి గోల్ లభించింది. బెటిస్ ఆటగాడు అలిన్ టోస్కా సెల్ఫ్ గోల్ చేసి, బార్సిలోనా ఖాతాను తెరిచాడు. తమ ప్రమేయం లేకుండా గోల్ లభించడంతో ఉత్సాహం పుంజుకున్న బార్సిలోనాకు మరో మూడు నిమిషాల్లోనే సెర్గీ రాబర్టో గోల్‌ను సాధించిపెట్టాడు. రెండు గోల్స్ ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత బార్సిలోనా పూర్తిగా రక్షణాత్మక విధానాన్ని అనుసరించగా, గోల్స్ కోసం బెటిస్ ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్టార్ ఆటగాడు నేమార్ ఇటీవలే బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జెర్మెయిన్ (పిఎస్‌జి)కి ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిన విషయం తెలిసిందే. కీలక ఆటగాడు గారీ పెక్, లూయిస్ సొరెజ్ గాయాల కారణంగా జట్టులో లేరు. అయితే, వీరు లేని లోటు బార్సిలోనాపై ఏమాత్రం కనిపించకపోవడం విశేషం. ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి మ్యాచ్‌ని గెల్చుకొని సత్తా చాటింది.
రియల్ మాడ్రిడ్ దూకుడు
ఇప్పటి వరకూ 33 పర్యాయాలు విజేతగా నిలిచి, 23సార్లు రన్నరప్ ట్రోఫీని తీసుకున్న రియల్ మాడ్రిడ్ మరో టైటిల్‌పై కనే్నసింది. తాజా సీజన్ తొలి మ్యాచ్‌లో దూకుడుగా ఆడి, డెపోర్టివో లా కొరునాను 3-0 తేడాతో చిత్తుచేసింది. గెరాత్ బాలే, కాసెమిరో, టోనీ క్రూప్స్ తలా ఒక గోల్ చేసి, రియల్ మాడ్రిడ్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. ఒకవైపు బలమైన రక్షణ వలయాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు అవకాశం లభించిన ప్రతిసారీ దాడులకు ఉపక్రమిస్తూ వ్యూహాత్మకంగా ఆడింది. అనుకున్న ఫలితాన్ని అందుకుంది.

చిత్రం..స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగాలో రియల్ బెటిస్, బార్సిలోనా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ దృశ్యం