క్రీడాభూమి

రష్యా, కతార్‌లోనే సాకర్ వరల్డ్ కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూరిచ్: ముడుపుల ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ పోటీలపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికైన గియానీ ఇన్ఫాంటినో స్పష్టతనిచ్చారు. 2018లో కతార్, 2020లో రష్యా దేశాల్లోనే వరల్డ్ కప్ పోటీలు జరుగుతాయని తేల్చిచెప్పాడు. ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించే హక్కుల కోసం ఫిఫా అధికారులకు రష్యా, కతార్ దేశాలు భారీగా ముడుపులు చెల్లించాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అమెరికా నిఘా విభాగం విచారణ జరుపుతున్నది. ఇప్పటికే 14 మంది ఫిఫా మాజీ అధికారులను స్విట్జర్లాండ్ పోలీస్‌లు అరెస్టు చేశారు. కాగా, అక్రమ పద్ధతుల్లో హక్కులను సంపాదించుకున్న కారణంగా రష్యా, కతార్‌లకు వరల్డ్ కప్‌ను నిర్వహించే బాధ్యతను ఇవ్వకుండా మళ్లీ బిడ్స్‌ను పిలవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. సెప్ బ్లాటర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తలెత్తిన ఈవివాదంపై ఇన్‌ఫాంటినో స్పందిస్తాడని, వరల్డ్ కప్ కేటాయింపులను రద్దు చేస్తాడని కొంతమంది బలంగా వాదించారు. అయితే, ఫిఫా వార్షిక సభ 2010లో తీసుకున్న నిర్ణయాన్ని తిరగతోడే ఆలోచన లేదని, రష్యా, కతార్ దేశాల్లోనే వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ జరుగుతుందని ఇన్‌ఫాంటినో స్పష్టం చేశాడు.