క్రీడాభూమి

పతకాలపై కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంబర్గ్, ఆగస్టు 24: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా భారత బాక్సర్లు సిద్ధమయ్యారు. 2009, 2011, 2015 ఈవెంట్స్‌లో భారత్ ఒక్కో కాంస్య పతకాన్ని అందుకుంది. తొలుత విజేందర్ సింగ్ పతకాన్ని సాధించగా, 2011లో వికాస్ క్రిషన్, 2015లో శివ థాపా భారత్‌కు పతకాలు అందించారు. ఈసారి మరింత ఉత్తమ ఫలితాలను రాబట్టడమే లక్ష్యంగా భారత బృందంలోని బాక్సర్లు స్పష్టం చేశారు. ప్రత్యర్థులకు గట్టిపోటీనిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పతకాలు సాధించడానికి తాము పోరాడతామని చెప్పారు. అన్ని విధాలా ఈ పోటీలకు సిద్ధమయ్యామని, ప్రత్యర్థులకు దీటైన సమాధానం ఇస్తామని తెలిపారు. ఇలావుంటే, ప్రపంచ బాక్సింగ్‌లో ఇంత వరకూ కాంస్యాలతో సరిపుచ్చుకున్న భారత్‌కు ఈసారి స్వర్ణం లేదా రజతం లభిస్తుందా అన్న ఆసక్తి అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తున్నది. శివ థాపాపై అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయ.
భారత బృందం: అమిత్ ఫంగల్ (49 కిలోలు), కవీందర్ బిస్త్ (52 కిలోలు), గౌరవ్ బింధూరి (56 కిలోలు), శివ థాపా (60 కిలోలు), మనోజ్ కుమార్ (69 కిలోలు), వికాస్ క్రిషన్ (75 కిలోలు), సుమీత్ సంగ్వాన్ (91 కిలోలు), సతీష్ కుమార్ (+91 కిలోలు).