క్రీడాభూమి

చచ్చీచెడీ గెలిచిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, ఆగస్టు 24: శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో వనే్డలో టీమిండియా నిలకడలేని ఆటను ప్రదర్శించి, అతి కష్టం మీద మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. శ్రీలంక 8 వికెట్లకు 236 పరుగులు చేయగా, వర్షం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడడంతో 47 ఓవర్లలో 231 పరుగులుగా కుదించిన లక్ష్యాన్ని అందుకోవడంలో తడబడిన భారత్‌కు మహేంద్ర సింగ్ ధోనీ, భువనేశ్వర్ కుమార్ వీరోచిత పోరాటం విజయాన్ని అందించింది.
ఆదుకున్న మిడిల్ ఆర్డర్
టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక టాప్ ఆర్డర్ విఫలంకాగా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మిలింద సిరివర్దన, చమర కపుగడేర ఆదుకున్నారు. శ్రీలంక 41 పరుగు వద్ద తొలి వికెట్‌ను నిరోషన్ డిక్‌విల్లా రూపంలో కోల్పోయింది. 24 బంతులు ఎదుర్కొన్న అతను మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు సాధించి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు చిక్కాడు. ఆతర్వాత దనుష్క గుణతిలక (19), కుశాల్ మేండిస్ (19), కెప్టెన్ ఉపుల్ తరంగ (9), ఏంజెలో మాథ్యూస్ (20) తక్కువ స్కోర్లపే వెనుదిరిగారు. జట్టు సంక్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు మిలింద సిరివర్దన, చమర కపుగడేర జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు వారు 91 పరుగులు జోడించారు. మిలింద సిరివర్దన 58 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు చేసి, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత కొద్ది సేపటికే చమర కపుగడేర వికెట్ కూడా కూలింది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన అతను 61 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్ల సాయంతో 40 పరుగులు చేశాడు. అకిల దనంజయ 9 పరుగులకే అవుటయ్యాడు. చివరిలో దుష్మంత చమీరా (6), విశ్వ ఫెర్నాండో (3) నాటౌట్‌గా నిలవగా, శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 236 పరుగులు చేసింది. భారత యువ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 43 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చాడు. యుజువేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ చెరొక వికెట్ సాధించారు.
మిడిల్ ఆర్డర్ విఫలం
శ్రీలంక జట్టును మిడిల్ ఆర్డర్ ఆదుకుంటే, భారత మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడడంతో, భారత్ లక్ష్యాన్ని 47 ఓవర్లలో 231 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ధాటిగానే ఆడారు. మొదటి వికెట్‌కు వీరు 109 పరుగులు జోడించడంతో టీమిండియా సులభంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. రోహిత్ శర్మ 45 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 54 పరుగులు చేసి, అకిల దనంజయ బౌలింగ్‌లో ఎల్‌బి కావడంతో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. మరో నాలుగు పరుగుల తర్వాత శిఖర్ ధావన్ కూడా వెనుదిరిగాడు. 50 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగులు చేసిన అతనిని ఏంజెలో మాథ్యూస్ క్యాచ్ అందుకోగా మిలింద సిరివర్దన పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత వికెట్ల పతనం కొనసాగింది. అకిల దనంజయ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక లోకేష్ రాహుల్ (4), కేదార్ జాధవ్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) వెనుదిరిగారు. మహేంద్ర సింగ్ ధోనీ క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా, హార్దిక్ పాండ్య పరుగుల ఖాతా తెరవకుండానే అకిల దనంజయ బౌలింగ్‌లో అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి, లంక వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా స్టంప్ చేయడంతో అవుటయ్యాడు. ఆరు పరుగులు చేసిన అక్షర్ పటేల్ వికెట్ కూడా అకిల దనంజయకే దక్కింది. ఈ దశలో మహేంద్ర సింగ్ ధోనీ, భువనేశ్వర్ కుమార్ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ 44.2 ఓవర్లలో జట్టును ఏడు వికెట్లకు 231 పరుగులకు చేర్చి, మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. ధోనీ 68 బంతుల్లో 45, భువీ 80 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరూ బ్యాటింగ్‌కు వచ్చే సమ యానికి భారత జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. ఓటమి తప్పదేమోనన్న అనుమానం వ్యక్తమైంది. చివరిలో ధోనీ చక్కటి సహకారాన్ని అందించగా, భువీ అర్ధ శతకం సా ధించి జట్టును గెలిపించాడు.