క్రీడాభూమి

ప్రపంచ బాడ్మింటన్ క్వార్టర్స్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లాస్గో, ఆగస్టు 24: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పివి సింధు క్వార్టర్ పైనల్స్ చేరింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. 2013, 2014 సంవత్సరాల్లో కాంస్య పతకాలను సాధించిన సింధు ప్రీ క్వార్టర్స్‌లో హాంకాంగ్‌కు చెందిన చెన్ గన్ ఇని 19-21, 23-21, 21-17 తేడాతో ఓడించింది. చెన్ నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైనప్పటికీ, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు అతి కష్టం మీద గెలిచి ముందంజ వేసింది. కాగా, శ్రీకాంత్ 21-14, 21-18 ఆధిక్యంతో ప్రపంచ 18వ ర్యాంక్ ఆటగాడు ఆండర్స్ ఆంటోనె్సన్‌పై విజయం సాధించాడు. కాగా, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి జోడీ పరాజయాన్ని ఎదుర్కొంది.
నాలుగో స్థానం..
న్యూఢిల్లీ: బాడ్మింటన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తెలుగు తేజం పివి సింధు నాలుగో స్థానానికి చేరింది. ఇప్పటి వరకూ ఐదో స్థానంలో ఉన్న 22 ఏళ్ల సింధు తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరింది. సైనా నెహ్వాల్ 16వ స్థానంలో ఉంది. కాగా, పురుషుల విభాగంలో శ్రీకాంత్ ఒక స్థానం కిందకు దిగి, ఇప్పుడు 10వ స్థానానికి చేరాడు. ఈ విభాగంలో సాయి ప్రణీత్ 19, హెచ్‌ఎస్ ప్రణయ్ 15, అజయ్ జయరామ్ 17 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
ర్యాంకింగ్స్ ‘టాప్-10’
మహిళల విభాగం: 1. తాయ్ జూ ఇంగ్ (చైనీస్ తైపీ), 2. అకానే యమాగూచీ (జపాన్), 3. సంగ్ జి హ్యున్ (దక్షిణ కొరియా), 4. పివి సింధు (్భరత్), 5. కరోలినా మారిన్ (స్పెయిన్), 6. సన్ యూ (చైనా), 7. హి బింజియావో (చైనా), 8. రచానొక్ ఇంతనాన్ (్థయిలాండ్), 9. బెల్వెన్ జాంగ్ (అమెరికా), 10. చెన్ యూఫెయ్ (చైనా).
పురుషుల విభాగం: 1. సన్ వాన్ హో (దక్షిణ కొరియా), 2. షి యుకీ (చైనా), 3. విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్), 4. చౌ తియాన్ చెన్ (చైనీస్ తైపీ), 5. లీ చాంగ్ వెయ్ (మలేసియా), 6. ఇంగ్ క లాంగ్ ఆగ్నస్ (హాంకాంగ్), 7. లిన్ డాన్ (చైనా), 8. చెన్ లాంగ్ (చైనా), 9. జాన్ ఒ జొర్గెనె్సన్ (డెన్మార్క్), 10. కిడాంబి శ్రీకాంత్ (్భరత్).

చిత్రం.. పివి సింధు