క్రీడాభూమి

నాదల్, ప్లిస్కోవాకు టాప్ సీడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 26: ఫ్లషింగ్ మెడోస్‌లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల విభాగంలో రాఫెల్ నాదల్, మహిళల విభాగంలో కరొలినా ప్లిస్కోవా టాప్ ర్యాంకింగ్స్‌ను సంపాదించారు. నాదల్ ఇటీవలే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను తిరిగి పొందిన విషయం తెలిసిందే. ప్లిస్కోవా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. ఈ ఏడాది జూన్ మాసంలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సాధించిన నాదల్ యుఎస్ ఓపెన్‌లో మూడోసారి టైటిల్ కోసం బరిలోకి దిగుతున్నాడు. ఇంతకు ముందు అతను 2010, 2013 సంవత్సరాల్లో ఈ టైటిల్ సాధించాడు. టాప్ సీడ్‌గా, హాట్ పేవరిట్‌గా అతను పోటీకి సిద్ధమవుతుండగా, మాజీ నంబర్ వన్ ఆండీ ముర్రే, స్విట్జర్లాండ్ హీరో రోజర్ ఫెదరర్ వరుసగా రెండు, మూడు సీడింగ్స్‌ను దక్కించుకున్నారు. ముర్రే ఈ టోర్నమెంట్ టైటిల్‌ను 2012లో సాధించాడు. మరోసారి విజేతగా నిలవాలన్న అతని ప్రయత్నం ఫలించడం లేదు. ఈసారి ఎంత వరకూ తన లక్ష్యాన్ని చేరుకుంటాడో చూడాలి. కాగా, ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్‌ను అందుకున్న తర్వాత ఫెదరర్‌ను ఫిట్నెస్ సమస్య వేధిస్తున్నది. కండరాలు బెణకడం, వెన్నునొప్పి తదితర కారణాలతో ఇటీవల జరిగిన సిన్సినాటి మాస్టర్స్ టోర్నమెంట్ నుంచి అతను వైదొలిగాడు. ఈ పరిస్థితుల్లో జర్మనీకి చెందిన 20 ఏళ్ల యువ సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్, డామినిక్ థియేమ్, గ్రెగర్ దిమిత్రోవ్, జో-విల్‌ఫ్రెడ్ సొంగా తదితరులు ఫేవరిట్స్ జాబితాలో చేరారు.
మహిళల విభాగానికి వస్తే, నిరుడు ఏంజెలిక్ కెర్బర్ టైటిల్ సాధించగా, ఫైనల్‌లో ఆమె చేతిలో ఓడిన ప్లిస్కోవా రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందింది. ఈసారి ఆమె టైటిల్‌పై కనే్నసింది. సిమోనా హాలెప్ (రుమేనియా), గార్బినె ముగురుజా (స్పెయిన్), కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) నుంచి ప్లిస్కోవాకు గట్టిపోటీ తప్పకపోవచ్చు.

చిత్రాలు.. రాఫెల్ నాదల్ *కరొలినా ప్లిస్కోవా