క్రీడాభూమి

తీవ్ర గాయాలు తప్పవేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ఫ్లాయిడ్ మేవెదర్‌ను ఢీ కొంటున్న కానర్ మెక్‌గ్రెగర్‌కు తీవ్ర గాయాలు తప్పవేమోనని బ్రిటన్ స్టార్ బాక్సర్ అమిర్ ఖాన్ అనుమానం వ్యక్తం చేశాడు. 28 ఏళ్ల మెక్‌గ్రెగర్ ఇప్పటి వరకూ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొనకపోవడమే తన అనుమానానికి కారణమని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పేరుపొందిన అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ (యుఎఫ్‌సి)లో సమర్థుడిగా గుర్తింపు సంపాదించినప్పటికీ మెక్‌గ్రెగర్‌కు బాక్సింగ్‌లో అంతగా అనుభవం లేదు. ఐదు వేరువేరు బాక్సింగ్ విభాగాల్లో చాంపియన్‌షిప్స్‌ను కైవసం చేసుకొని, 49 ఫైట్స్‌లో పరాజయమే అన్నది లేకుండా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న 40 ఏళ్ల మేవెదర్‌తో అతను పూర్తిగా బాక్సింగ్ నిబంధనల ప్రకారమే పోరాడాల్సి ఉంటుంది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌కు అలవాటుపడిన అతను బాక్సింగ్ ఫైట్‌లో ఎంత వరకూ రాణిస్తాడన్నది అనుమానమే. ఇదే విషయాన్ని అమీర్ ఖాన్ ప్రస్తావించాడు. బలమైన పంచ్‌లు విసిరే అలవాటున్న మేవెదర్‌కు చిక్కకుండా 12 రౌండ్ల ఫైట్‌ను పూర్తి చేయడం అనుకున్నంత సులభం కాదని అతను స్పష్టం చేశాడు. మెక్‌గ్రెగర్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేకపోయినా, ఇది పూర్తిగా బాక్సింగ్ ఫైట్ కావడం, అందులోనూ ఓటమి తెలియని మేవెదర్ ప్రత్యర్థి కావడం అతని విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయని అమీర్ ఖాన్ అన్నాడు. తీవ్ర గాయాలు కాకుండా తప్పించుకుంటే మెక్‌గ్రెగర్ గెలిచినట్టేనని వ్యాఖ్యానించాడు.