క్రీడాభూమి

అజేయ ‘హాఫ్ సెంచరీ’ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ వెగాస్, ఆగస్టు 26: పరాజయం అన్నదే ఎరుగని ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ కెరీర్‌లో 50వ విజయాన్ని నమోదు చేస్తాడా? లేక చాలెంజర్ కానన్ మెక్‌గ్రెగర్ చేతిలో కంగుతిని, కెరీర్‌లో తొలి పరాజయాన్ని చవిచూస్తాడా? అన్న ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. ఇప్పటి వరకూ 49 ఫైట్స్‌లో పాల్గొని, అన్నింటినీ గెల్చుకున్న మేవెదర్ మరో విజయాన్ని నమోదు చేసి, 50 ఫైట్లు.. 50 విజయాలతో కెరీర్‌ను ముగించాలన్న పట్టుదలతో ఉన్నాడు. నిజానికి గత ఏడాది ఆరంభంలోనే అతను కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కానీ, అత్యంత భారీ మొత్తం ప్రైజ్‌మనీగా ఉండడం, గెలిచినా, ఓడినా కోట్ల రూపాయలు దక్కడం వంటి అంశాలు ప్రభావితం చూపగా అతను ఈ ఫైట్‌కు మొగ్గుచూపాడు. ‘ది బిగ్గెస్ట్ ఫైట్’గా చెప్తున్న ఈ పోరు ప్రైజ్‌మనీ ఎంత అన్న విషయాన్ని నిర్వాహకులు చాలా గోప్యంగా ఉంచారు. అయితే, ప్రైజ్‌మనీ సుమారు 300 మిలియన్ డాలర్లు (సుమారు 1,915.55 కోట్ల రూపాయలు) ఉండవచ్చని సమాచారం. లాస్ వెగాస్‌లోని ఎంజిఎం గ్రాండ్ వద్ద ఉన్న టి-మొబైల్ ఎరెనాలో శనివారం (్భరత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు) మొదలయ్యే ఈ ఫైట్ విజేతకు 180 మిలియన్ డాలర్లు (1,149.93 కోట్ల రూపాయలు) లభిస్తాయి. ఓడిన వారికి 120 మిలియన్ డాలర్లు (సుమారు 766.62 కోట్ల రూపాయలు) దక్కుతాయి. 12 రౌండ్ల సూపర్ ఫైట్‌ను సుమారు 200 దేశాల్లో అభిమానులు వీక్షిస్తారని అంచనా. అయితే, భారత్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉండదని ఫైట్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను చేజిక్కించుకున్న వెక్టా సంస్థ ప్రకటించింది. భారత్‌లో ఆన్‌లైన్‌లో చూడవచ్చని సూచించింది.

చిత్రం..ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్, కానర్ మెక్‌గ్రెగర్