క్రీడాభూమి

సైనా ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లాస్గో, ఆగస్టు 26: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో నిరుటి రన్నరప్‌గా బరిలోకి దిగిన హైదరాబాదీ సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్స్‌లో ఓటమిపాలైంది. నొజోమీ ఒకుహరాతో ఒక గంట, 14 నిమిషాలు పోరాడిన ఆమె చివరికి 18-21, 21-14, 21-15 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఫిట్నెస్ సమస్యల కారణంగా చాలాకాలం విజయాలకు దూరమైనప్పటికీ, క్రమంగా మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నట్టు కనిపించిన ఆమె ప్రపంచ చాంపియన్‌షిప్స్ క్వార్టర్ ఫైనల్‌లో 21-19, 18-21, 21-15 తేడాతో సంగ్ జీ హ్యున్‌పై విజయం సాధించింది. కాగా, సెమీస్‌లో ఆమెతో తలపడిన నజోమీ ఒకుహరా 21-18, 14-21, 21-15 ఆధిక్యంతో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్‌ను ఓడించింది. ఈ రెండు మ్యాచ్‌లు మూడు సెట్లపాటు కొనసాగడం విశేషం. క్వార్టర్స్‌లో మూడు సెట్లు ఆడిన ఒకుహరా సెమీస్‌లో సైనాను వరుస సెట్లలో చిత్తుచేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఒలింపిక్స్‌కు వెళ్లకుంటే బాగుండేది!
రియో ఒలింపిక్స్‌కు వెళ్లి పొరపాటు చేశానని సైనా నెహ్వాల్ అంగీకరించింది. పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకపోయినప్పటికీ గత ఏడాది రియో ఒలింపిక్స్‌కు హాజరైన ఆమె రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఉక్రెయిన్‌కు చెందిన సాదాసీదా క్రీడాకారిణి మరిజా ఉలిటినా చేతిలో సైనా పరాజయాన్ని ఎదుర్కొవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, స్వదేశానికి చేరుకున్న వెంటనే ఆమె మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుంది. దీనితో ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నప్పటికీ ఆమె రియోకు వెళ్లిన విషయం స్పష్టమైంది. సుమారు ఏడాది తర్వాత సైనా ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. రియోకు వెళ్లడం వల్ల గాయం తిరగబెట్టిందని, శస్త్ర చికిత్స అనివార్యమైందని సైనా తెలిపింది. ఇప్పటికీ మోకాలి నొప్పి పూర్తిగా తగ్గలేదని అన్నది. అయితే, అప్పటితో పోలిస్తే చాలా మెరుగ్గా ఉందని తెలిపింది.
కాగా, పురుషుల విభాగంలో భారత్ పోరాటానికి క్వార్టర్ ఫైనల్స్‌తోనే తెరపడింది. సాయి ప్రణీత్, అజయ్ జయరామ్ మూడో రౌండ్‌కే పరిమితంకాగా, తెలుగు వీరుడు కిడాంబి శ్రీకాంత్ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసింది. సన్ వాన్ హో 21-14, 21-18 తేడాతో శ్రీకాంత్‌పై వరుస సెట్లలో విజయాన్ని నమోదు చేశాడు.

చిత్రం..సైనా నెహ్వాల్