క్రీడాభూమి

రహానేకు చోటు అనుమానమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్: అజింక్య రహానేకు మూడో వనే్డలో ఆడే అవకాశం లభిస్తుందా అన్నది అనుమానమే. కేదార్ జాధవ్ విఫలమయ్యాడు కాబట్టి, రహానేను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ, రోహిత్ శర్మను కాదని అతనిని జట్టులోకి తీసుకునే అవకాశం లేదని విశే్లషకులు అంటున్నారు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ ఇప్పుడు ఫిట్నెస్‌తో ఉన్నాడు. ఫామ్‌ను కూడా కొనసాగిస్తున్నాడు. ఓపెనర్‌గా శిఖర్ ధావన్‌ను తప్పించే అవకాశాలు ఏమాత్రం లేని నేపథ్యంలో, రహానేతో రోహిత్‌ను మార్చడం ద్వారా కోహ్లీ ప్రయోగం చేయాలి. అయితే, అందుకు అతను ఎంత వరకూ సిద్ధంగా ఉంటాడన్నదే ప్రశ్న. ఏ రకంగా చూసినా, మరోసారి రహానే బెంచ్‌కే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తున్నది.

చిత్రం..నెట్స్‌లో రోహిత్ శర్మ, అజింక్య రహానే