క్రీడాభూమి

మేం గెలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, ఆగస్టు 26: ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ, భారత్‌ను ఓడించే సత్తా తమకు లేకపోలేదని శ్రీలంక స్టాండ్-ఇన్ కెప్టెన్ చామర కపుగడేర అన్నాడు. టీమిండియాపై గెలుస్తామని శనివారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశాడు. వరుస పరాజయాలతో జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోయిందని వస్తున్న విమర్శలను అతను తోసిపుచ్చాడు. తామంతా ఆత్మవిశ్వాసంతోనే ఆడుతున్నామని, వైఫల్యాలు అనేవి ఏ జట్టుకైనా సహజమేనని వ్యాఖ్యానించాడు. రెండో వనే్డలో 9 ఓవర్లలో 48 పరుగులిచ్చి, ఆరు వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ అకిల దనంజయను కపుగడేర ప్రశంసించాడు. అతను గొప్పగా రాణించడం లంకకు అదనపు బలాన్ని ఇస్తున్నదని అన్నాడు. అన్ని రకాలుగా సిద్ధమై, మైదానంలోకి దిగుతున్నామని చెప్పాడు.