క్రీడాభూమి

టార్గెట్ వనే్డ సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, ఆగస్టు 26: శ్రీలంకతో ఆదివారం జరిగే మూడో వనే్డను గెల్చుకొని, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా విరాట్ కోహ్లీ బృందం బరిలోకి దిగుతున్నది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా మూడో విజయాన్ని సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది. చివరి రెండు మ్యాచ్‌లు జరిగే కొలంబోకు బయలుదేరి వెళ్లే ముందే, సిరీస్‌ను సాధించాలన్న భారత్ ప్రయత్నం ఎంత వరకూ సాధ్యమవుతుందనేది కెప్టెన్ కోహ్లీ నిర్ణయాలపై ఆధారాపడి ఉంటుంది. మొదటి వనే్డను ఎలాంటి కష్టం లేకుండా, తొమ్మిది వికెట్ల తేడాతో సొంతం చేసుకున్న తర్వాత, రెండో మ్యాచ్‌లో కోహ్లీ కొన్ని ప్రయోగాలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ స్లాట్‌ను మార్చకపోయినా, మిడిల్ ఆర్డర్‌లో మార్పులు, చేర్పులు చేశాడు. అతని ప్రయోగం బెడిసికొట్టింది. ఒకానొక దశలో భారత్ 131 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అర్ధ శతకం సాధించిన భువనేశ్వర్ కుమార్ ఆదుకోకపోతే, టీమిండియా పరిస్థితి మరోలా ఉండేది. లోకేష్ రాహుల్, కేదార్ జాధవ్‌ను మూడు, నాలుగు స్థానాల్లో దింపడం కోహ్లీ చేసిన పొరపాటుగా విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అకిల దనంజయ బంతులను సమర్థంగా ఎదుర్కోలేక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చాలా ఇబ్బంది పడ్డారు. కేదార్ జాధవ్ అవుటైన తీరు అతని అనుభవ రాహిత్యానికి అద్దం పడుతుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని, మూడో వనే్డలో తిరిగి తన పాత విధానాలకే కోహ్లీ ప్రాధాన్యం ఇస్తాడన్న వాదన వినిపిస్తున్నది.
వనే్డల్లో టాస్ కీలక పాత్ర వహిస్తుందనేది వాస్తవం. కోహ్లీ టాస్ గెలిస్తే, ఇంతకు ముందు మాదిరిగానే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నందున, లక్ష్యాన్ని నిర్దేశించడం కంటే, ఛేదించడమే టీమిండియాకు సులభం. ప్లేయింగ్ ఎలెవెన్‌ను తరచు మార్చే అలవాటులేని కోహ్లీ మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జట్టునే కొనసాగించాలని నిర్ణయిస్తే, హార్దిక్ పాండ్య ఫిట్నెస్ సమస్య తెరపైకి వస్తున్నది. ఎడమ మోకాలికి పట్టీకట్టుకున్న హార్దిక్ పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నాడా? లేడా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం కండరాలు బెణికాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జట్టు మేనేజ్‌మెంట్ పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ, ఈ టూర్‌లో మూడు పర్యాయాలు అతను మోకాలి నొప్పితో మైదానాన్ని వదలి వెళ్లడం అనునాలను పెంచుతున్నది. ఒకవేళ జట్టు మేనేజ్‌మెంట్ వాదనే నిజమైతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లేకపోతే మాత్రం, జట్టులోకి ఒక అదనపు బౌలర్ అవసరమవుతాడు. 2019 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకొని, ఇప్పటి నుంచే యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే జట్టు మేనేజ్‌మెంట్ ఉంటే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌ను బౌలింగ్ విభాగంలో కొనసాగిస్తారు.
లంకకు కష్టం
స్లో ఓవర్‌రేట్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ఉపుల్ తరంగపై రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ వేటు పడింది. దీనితో చామర కపుగడేర జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం, రెండు వరుస పరాజయాలు వెక్కిరించడం లంకను వేధిస్తున్న అంశాలు. ఈ పరిస్థితుల్లో ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఖరారు చేయడానికి కపుగడేర నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఎవరికీ అంతుచిక్కని రీతిలో జట్టు నుంచి ఉద్వాసనకు గురైన డాషింగ్ బ్యాట్స్‌మన్, టెస్టు జట్టు కెప్టెన్ దినేష్ చండీమల్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అతని చేరికతో లంక బ్యాటింగ్ బలపడుతుంది. అదే సమయంలో బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేర్పులు అనివార్యమవుతాయి. ఎన్ని కాంబినేషన్లను ప్రయత్నించినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, భారత్‌ను ఓడించడం శ్రీలంకకు సులభం కాదన్నది నిజం. ఈ సిరీస్‌లో కనీసం రెండు మ్యాచ్‌లు గెలిస్తే తప్ప 2019 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌కు నేరుగా అర్హత పొందే అవకాశం లంకకు తప్పదు. ఈ నేపథ్యంలో ఎంత వరకూ ఆ జట్టు విజయం కోసం శ్రమిస్తుందో, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.