క్రీడాభూమి

మేవెదర్ ‘్ఫఫ్టీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ వెగాస్, ఆగస్టు 27: ఓటమి ఎరుగని స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ కెరీర్‌లో 50వ విజయాన్ని పూర్తి చేశాడు. 49 ఫైట్స్‌లో ఒక్క పరాజయం కూడా లేకుండా కెరీర్‌ను రెండేళ్ల క్రితం ముగించిన మేవెదర్ ఆతర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నాడు. భారీ ప్రైజ్‌మనీతో ఆఫర్ రావడంతో కానర్ మెక్‌గ్రెగర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ‘సూపర్ ఫైట్ ఆఫ్ ది సెంచరీ’గా అభిమానులు పేర్కొంటున్న ఈ యుద్ధం 12 రౌండ్ల వరకూ కొనసాగాల్సి ఉండగా, 10వ రౌండ్‌లోనే మేవెదర్ టెక్నికల్ నాకౌట్ విధానంలో గెలిచినట్టు రిఫరీ రాబర్ట్ బైర్డ్ ప్రకటించాడు. ఆరంభంలో మేవెదర్‌కు మెక్‌గ్రెగర్ గట్టిపోటీనిచ్చాడు. నిజానికి మొదట్లో మెక్‌గ్రెగర్ ఆధిపత్యాన్ని కనబరిచాడు. కానీ, క్రమంగా నీరసించిపోయాడు. తొమ్మిదో రౌండ్ చివరిలో నీరసంగా రోప్స్‌పై కుప్పకూలిన మెక్‌గ్రెగర్‌పై మేవెదర్ రెండు లెఫ్ట్ హుక్స్‌ను సంధించాడు. పదో రౌండ్ ఆరంభంలోనే మెక్‌గ్రెగర్ నిలబడలేని స్థితికి చేరుకున్నాడు. దీనితో ఫైట్‌ను రిఫరీ బైర్డ్ నిలిపేసి, మేవెదర్ గెలిచినట్టు ప్రకటించాడు.
అమెరికా గాయని డెమీ లొవాటో జాతీయ గీతం ఆలపించిన తర్వాత మొదలైన సూపర్ ఫైట్‌ను తిలకించడానికి నటి చార్లీజ్ థెరాన్, గాయని జెన్నీఫర్ లొపెజ్, ఆమె సహచరుడు అలెక్స్ రోడ్రిగెజ్, నటుడు, నిర్మాత, గాయకుడు బ్రూస్ విల్లీస్, ఫిల్మ్ మేకర్ జెర్రీ బ్రూకెమెర్, బ్యాక్‌స్ట్రీట్ బాయిస్ స్టార్లు నిక్ కార్టర్, ఎజె మెక్‌లీన్, నటుడు డాన్ చిడిల్, ఎన్‌బిఎ స్టార్లు లెబ్రాన్ జేమ్స్, జేమ్స్ హార్డెన్, డిస్క్ జాకీ అలెక్స్ పాల్, ఆండ్రూ టాగర్ట్, నటుడు జెమీ ఫాక్స్, నటి వనెసా హడ్జెన్స్, ఎంటర్‌టైనర్ అకోన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.