క్రీడాభూమి

ముర్రే ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 27: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే గాయం కారణంగా యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ నుంచి గాయాల కారణంగా వైదొలగిన స్టార్ల జాబితాలో ముర్రే కూడా చేరాడు. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్, నాలుగో ర్యాంక్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రిన్కా, ఐదో సీడ్ నొవాక్ జొకోవిచ్, 10వ సీడ్ కెయ్ నిషికొరీ, 11వ సీడ్ మిలోస్ రానిక్ యుఎస్ ఓపెన్‌కు దూరమయ్యారు. ఇప్పుడు ముర్రే వారి సరసన చేరడంతో, పురుషుల సింగిల్స్‌లో సీడింగ్స్‌లో మార్పులు అనివార్యమయ్యాయి. కాగా, మహిళల విభాగంలో ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ గర్భవతైన కారణంగా యుఎస్ ఓపెన్‌లో ఆడడం లేదు. తిమియా బక్సిన్‌స్కీ గాయంతో యుఎస్ ఓపెన్‌కు దూరమైంది.
తాజా సీడింగ్స్ ‘టాప్-10’
పురుషుల విభాగం: 1. రాఫెల్ నాదల్, 2. రోజర్ ఫెదరర్, 3. అలెగ్జాండర్ జ్వెరెవ్, 4. మారిన్ సిలిక్, 5. డొమినిక్ థియేమ్, 6. గ్రిగర్ దిమిత్రోవ్, 7. జో విల్‌ఫ్రైడ్ సొంగా, 8. డేవిడ్ గోఫిన్, 9. జాన్ ఇస్నర్, 10. రాబర్టో బటిస్టా అగుట్.
మహిళల విభాగం: 1. కరోలినా ప్లిస్కోవా, 2. సిమోనా హాలెప్, 3. గార్బినె ముగురుజా, 4. ఎలినా స్విటోనియా, 5. కరోలిన్ వొజ్నియాకి, 6. ఏంజెలిక్ కెర్బర్, 7. జొహన్నా కొన్టా, 8. స్వెత్లానా కుజ్నెత్సొవా, 9. వీనస్ విలియమ్స్, 10. డొమినికా సిబుల్కొవా.