క్రీడాభూమి

మ్యాచ్‌ల షెడ్యూల్ సమస్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: ఇటీవల ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మ్యాచ్‌ల షెడ్యూలింగ్ నిజంగా ఒక సమస్యగానే ఉందని, అయితే క్రీడాకారులు అలాంటి వాటికి అలవాటు పడాల్సిన అవసరం ఉందని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పి గోపీచంద్ అన్నాడు.‘ఒక విధంగా అది ఒక సమస్యే. అయితే ఒక్కోసారి ఆటగాళ్లు ఆ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. పివి సింధు సెమీఫైనల్ మ్యాచ్ శనివారం రాత్రి జరిగింది. ఆమె నిద్రపోయే సమయానికి రాత్రి ఒంటిగంట దాటింది. ఆ మర్నాడు ఉదయమే ఫైనల్ ఆడాల్సి వచ్చిందని గోపీచంద్ చెప్పాడు. ఒక్కోసారి ఇది అదనపు శక్తి అవసరమైన సుదీర్ఘ మ్యాచ్‌లపై ప్రభావం చూపిస్తుంది’ అని అతను అన్నాడు. అయితే క్రీడాకారులు ఇలాంటి వాటికి అలవాటు పడ్డం ముఖ్యమని ఆయన అన్నాడు. మొత్తంమీద మరింత మెరుగ్గా నిర్ణయించాల్సిన మ్యాచ్‌లు ఈ టోర్నమెంట్‌లో మూడు నాలుగు ఉన్నాయని తాను అనుకొంటున్నట్లు మ్యాచ్‌ల షెడ్యూలింగ్‌పై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా గోపీచంద్ చెప్పాడు. టెలివిజన్ అవసరాలు, అభిమానుల కోరికలను దృష్టిలో పెట్టుకోవలసి వచ్చినప్పుడు ఒక్కోసారి క్రీడాకారులు నష్టపోవలసి ఉంటుందని కూడా ఆయన అన్నాడు.
కాగా, వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింధు అద్భుతంగా ఆడిందని ఆమె కోచ్ కూడా అయిన గోపీచంద్ చెప్పాడు. సుదీర్ఘంగా సాగిన ఫైనల్లో సింధు స్వర్ణపతకం సాధిస్తుందని అందరూ అనుకొన్నామని, అయితే స్వర్ణ పతకం సాధించక పోయినా సింధు తన ఆటతో అందర్నీ ఆకట్టుకొందని అన్నాడు. భవిష్యత్తుల్లో ఆమె స్వర్ణపతకం తప్పకుండా సాధిస్తుందన్న ఆశాభావాన్ని గోపీచంద్ వ్యక్తం చేశాడు. కాగా, ఈ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులంతా చక్కగా రాణించారని, సైనా కాంస్యపతకం సాధించగా కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌లు కూడా చక్కటి పోరాట పటిమను కనబరిచారన్నాడు.