క్రీడాభూమి

బిసిసిఐ దేశవాళీ క్యాలెండర్‌లో మళ్లీ దులీప్ ట్రోఫీకి చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: బిసిసిఐ డొమెస్టిక్ క్యాలెండర్‌నుంచి దులీప్ ట్రోఫీని తొలగించవద్దని బిసిసిఐ పాలకుల కమిటీ (సిఓఏ) బిసిసిఐని మంగళవారం ఆదేశించింది. బిసిసిఐ టెక్నకల్ కమిటీ చైర్మన్ సౌరబ్ గంగూలీకి తెలియకుండా క్యాలెండర్‌నుంచి దులీప్ ట్రోఫీని తొలగించిన తర్వాత గంగూలీ బిసిసిఐ జనరల్ మేనేజర్ ఎంవి శ్రీ్ధర్‌కు ఘాటయిన లేఖ రాయడంతో దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌ను తిరిగి చేర్చాలంటూ సిఓఏ బిసిసిఐని ఆదేశించింది.‘దులీప్ ట్రోఫీని పునరుద్ధరించడం జరిగింది. ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తాం. దీని నిర్వహిణకు సంబంధించిన షెడ్యూల్‌ను రూపొందించడం జరుగుతుంది. ఇది చాలా ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్, దీనిని తప్పకుండా నిర్వహించాలి. ఈ సీజన్‌లో ఇది నిర్వహించడం జరుగుతుంది’ అని సిఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ మీడియాకు చెప్పారు.
నిజానికి గంగూలీ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ దులీప్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి గత నెల కోల్‌కతాలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. గత సీజన్‌లో దులీప్ ట్రోఫీలో పింక్ బంతులను ప్రయోగాత్మకంగా ఉపయోగించడం జరిగింది. ఈ సారి కూడా ఈ ప్రయోగాన్ని కొనసాగించాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే గంగూలీకి తెలియజేయకుండా బిసిసిఐకి చెందిన ఒక ఉన్నతాధికారి దులీప్ ట్రోఫీని డొమెస్టిక్ క్యాలెండర్‌నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన గంగూలీ బిసిసిఐ జనరల్ మేనేజర్ ఎంవి శ్రీ్ధర్‌కు ఘాటయిన లేఖ రాశాడు. ‘ఈ సీజన్‌లో దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ జరగకపోవచ్చంటూ మీడియాలో వస్తున్న వార్తలను నేను చూస్తున్నాను. అది నిజమో కాదో నాకు తెలియదు కానీ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లకు మరోసారి పింక్ బాల్స్‌ను ఉపయోగించాలని, గత ఏడాది ఫార్మాట్‌లోనే ఈ ఏడాది కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించాలని టెక్నికల్ కమిటీ అంగీకరించిందనే విషయం మీకు తెలుసు’ అని శ్రీ్ధర్‌కు పంపిన ఇ- మెయిల్‌లో గంగూలీ పేర్కొన్నాడు. దీంతో రంగంలోకి దిగిన సిఓఏ తిరిగి దులీప్ ట్రోఫీని డొమెస్టిక్ క్యాలెండర్‌లో చేర్చాలంటూ బిసిసిఐని ఆదేశించింది.