క్రీడాభూమి

లంక క్రికెట్‌లో భారీ కుదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 29: ఇటీవలి కాలంలో తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడలేక పోతున్న శ్రీలంక క్రికెట్‌లో టీమిండియాతో సిరీస్ ముగియక ముందే పెనుమార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. టీమిండియా చేతిలో టెస్టుల్లో 3-0 తేడాతో చిత్తుగా ఓటమి పాలవడం, ఆ తర్వాత వన్‌డే సిరీస్‌లోను వరసగా ఓటములను ఎదుర్కొని సిరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో సనత్ జయసూర్య నేతృత్వంలోని శ్రీలంక సెలెక్షన్ కమిటీ మూకుమ్మడిగా రాజీనామా చేసింది. జయసూర్యతో పాటుగా రంజిత్ మదురసింఘె, రమేశ్ కలువితరణ, అశాంక గురుసింఘె, ఎరిక్ ఉపశాంతలతో కూడిన సెలెక్షన్ కమిటీ రాజీనామా చేసినట్లు శ్రీలంక క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే మంగళవారం జరిగిన సమావేశంలో ఈ రాజీనామాలను అధికారికంగా ఆమోదించలేదని శ్రీలంక క్రికెట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. అధికారికంగా ధ్రువీకరించే వరకు వారు పదవుల్లో కొనసాగుతారని కూడా ఆయన చెప్పారు. ఒక వేళ సెలెక్షన్ కమిటీ రాజీనామాలను ఆమోదించినప్పటికీ సెప్టెంబర్ 6న టీమిండియా పర్యటన ముగిసే వరకు వీరంతా తమ పదవుల్లో కొనసాగుతారని తెలుస్తోంది. ఆ రోజున టీమిండియా తన పర్యటనలో చివరి మ్యాచ్ అయిన ఏకైక టి-20 మ్యాచ్‌ని ఆడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సెలెక్షన్ కమిటీ పదవీ కాలాన్ని గత మేలోనే ఆరునెలలు పొడిగించారు. కాగా, గత ఏప్రిల్‌లో శ్రీలంక టీమ్ మేనేజర్‌గా సెలెక్షన్ కమిటీలో చేరిన గురుసిన్హపై ఈ రాజీనామాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. గత కొంతకాలంగా శ్రీలంక క్రికెట్ పతనావస్థ దిశగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో ఆ జట్టు సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను ఏ ఫార్మాట్‌లోను ఓడించలేక పోయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్‌షిప్స్ ట్రోఫీలో సెమీఫైనల్లో స్థానం కోసం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే అది పెద్దగా నిరాశ పరచలేదు. కానీ ఆ తర్వాత సొంతగడ్డపై జింబాబ్వే చేతిలో వన్‌డేలలో 3-2 తేడాతో ఓటమి పాలవడం, ఆ తర్వాత భారత్‌తో అటు టెస్టుల్లోను, ఇటు వన్‌డేలలోను ఘోరంగా పరాజయం పాలవడం తెలిసిందే. ఈ వరస పరాజయాలు సెలెక్టర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు కనిపిస్తోంది.