క్రీడాభూమి

సత్తా చాటిన గౌరవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంబర్గ్, ఆగస్టు 29: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ గౌరవ్ బిధూరీ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. వైల్డ్‌కార్డుతో ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్న అతను మంగళవారం ఇక్కడ 56 కిలోల బాంటమ్ వెయిట్ విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో ట్యునీషియాకి చెందిన బిలెల్ మహ్మదీని మట్టికరిపించి భారత్‌కు పతకాన్ని ఖాయం చేశాడు. ఈ విజయంతో అతను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలి ప్రయత్నంలోనే పతకాన్ని అందుకోనున్న రెండవ భారత బాక్సర్‌గానూ, వైల్డ్‌కార్డు ద్వారా పతకాన్ని అందుకోనున్న నాలుగవ భారత బాక్సర్‌గానూ ఆవిర్భవించనున్నాడు. గతంలో (ప్రపంచ చాంపియన్‌షిప్ 2011 ఎడిషన్‌లో) వికాస్ కృష్ణన్ మాత్రమే వైల్డ్‌కార్డు ద్వారా తొలి ప్రయత్నంలో ఈ ఘనత సాధించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇంతకుముందు 2009లో విజేందర్ సింగ్, 2015లో శివ థాపా కూడా తొలి ప్రయత్నంలోనే సెమీ ఫైనల్స్‌కు చేరుకుని కాంస్య పతకాలను సాధించినప్పటికీ ఇవన్నీ వైల్డ్‌కార్డులతో సాధించిన పతకాలు కావు. అయితే ఇప్పుడు గౌరవ్ బిధూరీ కూడా వీరి మాదిరిగానే కాంస్య పతకంతో సంతృప్తి చెందుతాడా? లేక మరింత ముందుకు దూసుకెళ్లి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే. క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో ట్యునీషియా బాక్సర్‌పై విజయం సాధించిన అనంతరం గౌరవ్ పిటిఐ మాట్లాడుతూ, వైల్డ్‌కార్డుతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న తనకు ఇప్పుడు ఎంతో వేగవంతంగా పతకం ఖాయమవడం తీవ్రమైన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోందని, ఏది ఏమైనప్పటికీ కాంస్యం కంటే ఉత్తమ పతకాన్ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని ఎదురు చూస్తున్నానని స్పష్టం చేశాడు.