క్రీడాభూమి

కొరిక్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 31: మేటి స్టార్లకు సైతం వణుకు పుట్టిస్తున్న జర్మనీ యువ ఆటగాడు, నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రస్థానం రెండో రౌండ్‌లోనే ముగిసింది. క్రొయేషియాకు చెందిన బొర్నా కొరిక్ అతనిపై 3-6, 7-5, 7-6, 7-6 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, హోరాహోరీ పోరాటంతో వరుసగా మూడు సెట్లు కైవసం చేసుకొని కొరిక్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈసారి యుఎస్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరిట్‌గా పేర్కోలేకపోయినా, గట్టి పోటీనివ్వడంతోపాటు, మేటి ఆటగాళ్లకు బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయనుకున్న అలెగ్జాండర్ జ్వెరెవ్ ఇంటిదారి పట్టడం అతని అభిమానులను నిరాశ పరచింది. అతను కూడా తన ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. యుఎస్ ఓపెన్‌లో అద్భుత విజయాలను సాధించే సత్తా ఉందని తనకు తెలుసునని, గతంలో ఎన్నో పర్యాయాలు దానిని ఆచరణలో చూపానని జ్వెరెవ్ అన్నాడు. కానీ, కొరిక్ తన ప్రయాణాన్ని అడ్డుకున్నాడని వ్యాఖ్యానించాడు. తనకు ఫిట్నెస్ సమస్యలు ఏవీ లేదని స్పష్టం చేశాడు. కొరిక్ గొప్పగా ఆడాడని అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రశంసించాడు. అనుకున్నవన్నీ అనుకన్నట్టు ఎప్పుడూ జరగవని అన్నాడు.
ఈసారి వింబుల్డన్‌లో రన్నరప్ ట్రోఫీని అందుక్ను మారిన్ సిలిక్ రెండో రౌండ్‌లో జర్మనీ ఆటగాడు ఫ్లోరియన్ మేయర్‌ను 6-3, 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. వర్షం కారణంగా ఆలస్యంగా జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లో జువాన్ మార్టిన్ డెల్ పొట్రో 6-4, 7-6, 7-6 స్కోతో హెన్రీ లాకసొనెన్‌పై విజయం సాధించాడు. క్వాలిఫయర్ డెనిస్ షపొవలోవ్ 6-4, 6-4, 7-6 తేడాతో జో విల్‌ఫ్రైడ్ సొంగాపై ఎవరూ ఊహించని రీతిలో గెలుపొందాడు. ఆరో సీడ్ డామినిక్ థియేమ్ 6-4, 6-1, 6-1 తేడాతో అలెక్స్ డి మినార్‌ను చిత్తుచేశాడు.
రెండో రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో, జాన్ మిల్మన్ 6-3, 1-6, 6-4, 6-1 ఆధిక్యంతో 14వ సీడ్ నిక్ కిర్గియోస్‌ను ఓడించగా, జాన్ ఇస్నర్ 6-3, 6-4, 7-5 తేడాతో చుంగ్ హ్యూన్‌పై గెలిచాడు. డేల్ ఎడ్మండ్ 7-5, 6-2, 7-6 తేడాతో స్టీవ్ జాన్సన్‌ను వెనక్కు పంపాడు.

చిత్రం..బొర్నా కొరిక్