క్రీడాభూమి

చెమటోడ్చిన షరపోవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 31: నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వినియోగించిన కారణంగా సస్పెన్షన్‌కు గురై, శిక్షాకాలం ముగిసిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్న ప్రపంచ మాజీ నంబర్ వన్, రష్యా బ్యూటీ మరియా షరపోవా ఇక్కడ యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మూడో రౌండ్ చేరింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ఆమె రెండో రౌండ్‌లోలో హంగరీకి చెందిన తిమియా బబోస్‌ను 6-7, 6-4, 6-1 తేడాతో ఓడించింది. మొదటి రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి సిమోనా హాలెప్‌పై 6-4, 4-6, 6-3 ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసింది. రెండో రౌండ్‌లోనూ తీవ్రమైన ప్రతిఘటన ఎదురైనప్పటికీ, అతి కష్టం మీద గెలవడానికి ఆమెకు మొదటి మ్యాచ్ ఫలితం స్ఫూర్తినిచ్చిందనే చెప్పాలి. 30 ఏళ్ల వయసులోనూ షరపోవా హోరాహోరీ పోరాటాల్లో గెలవడం విశేషం.
తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ 7-5, 6-4 తేడాతో ఒసియాన్ డొడిన్‌పై విజయం సాధించి, హోం గ్రౌండ్‌లో అభిమానులను అలరించింది. మొదటి సెట్‌లో కొంత తడబడినప్పటికీ, ఆతర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది. వింబుల్డన్ చాంపియన్ గార్బినె ముగురుజా 6-4, 6-0 తేడాతో డువాన్ ఇంగ్ ఇంగ్‌ను సులభంగా ఓడించింది. ఇక మొదటి రౌండ్ మ్యాచ్‌ల విషయానికి వస్తే, ఎవ్‌గెనియా రొడినా, ఎలినా స్విటోలినా, కొకొ వండెవాగె, స్వెట్లాని కుజ్నెత్సొవా, డారియా గవ్రిలొవా తమతమ ప్రత్యర్థులపై విజయాలను నమోదు చేసి, రెండో రౌండ్ చేరారు.

చిత్రం..మరియా షరపోవా