క్రీడాభూమి

నాలుగో వనే్డలో రోహిత్, కోహ్లీ వీరవిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 31: ఓపెనర్ రోహిత్ శర్మ, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకాలతో రెచ్చిపోవడంతో, శ్రీలంకతో గురువారం జరిగిన నాలుగో వనే్డలో భారత్ వీరవిహారం చేసింది. చివరిలో మనీష్ పాండే (50 నాటౌట్), మహేంద్ర సింగ్ ధోనీ (49 నాటౌట్) కూడా రాణించడంతో, టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 375 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. అనంతరం శ్రీలంకను 207 పరుగులకే ఆలౌట్ చేసి, 168 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 4-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంతకు ముందు టెస్టు సిరీస్‌లో లంకపై 3-0 తేడాతో క్లీన్ స్వీప్ సాధించిన కోహ్లీ సేన, వనే్డ సిరీస్‌లోనూ ప్రత్యర్థికి వైట్ వాష్ వేయడం ఖాయంగా కనిపిస్తున్నది.
టాస్ గెలిచి బ్యాటింగ్
టాస్ గెలిచి, బ్యాటింగ్ పట్ల మొగ్గు చూపిన భారత్ ఈ నిర్ణయం సరైనదేనని నిరూపించే రీతిలో ఆడింది. కేవలం ఆరు పరుగుల స్కోరువద్ద శిఖర్ ధావన్ (4) వికెట్‌ను కోల్పోయినప్పటికీ, రోహిత్, కోహ్లీ భాగస్వామ్యంతో కోలుకుంది. ధావన్‌ను మిలింద పుష్పకుమార క్యాచ్ పట్టగా విశ్వ ఫెర్నాండో అవుట్ చేయడంతో, ఆరంభంలోనే వికెట్ లభించింనదన్న ఆనందం లంకేయులకు ఎక్కువ సేపు నిలవలేదు. రోహిత్, కోహ్లీ జోడీ విజృంభణకు లంక బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. రెండో వికెట్‌కు 219 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన కోహ్లీ 96 బంతులు ఎదుర్కొని 131 పరుగులు చేశాడు. లసిత్ మలింగ బౌలింగ్‌లో, దిల్షాన్ మునవీర క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరిన అతని స్కోరులో 17 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 19 పరుగులు చేసి, ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్‌లో వనిదు హసరంగకు దొరికిపోయాడు. తర్వాతి బంతికే రోహిత్‌ను కూడా మాథ్యూస్ అవుట్ చేశాడు. 88 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 104 పరుగులు చేసిన రోహిత్ అనూహ్యమైన దిశలో దూసుకొచ్చిన బంతిని అర్థం చేసుకోలేక, వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లాకు చిక్కాడు. లోకేష్ రాహుల్ ఏడు పరుగులు చేసి, అకిల దనంజయ బౌలింగ్‌లో వనిదు హసరంగ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. ఆతర్వాత మనీష్ పాండే, ధోనీ ఆరో వికెట్‌కు అజేయంగా 101 పరుగులు జోడించడంతో, భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 375 పరుగుల భారీ స్కోరును నమోదు చేయగలిగింది. పాండే 42 బంతుల్లో 50, ధోనీ 42 బంతుల్లో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. లంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 24 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. లసిత్ మలింగ, విశ్వ ఫెర్నాండో, అకిల దనంజయ తలా ఒక్కో వికెట్ పంచుకున్నారు.
భారీ లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో, తీవ్రమైన ఒత్తిడికి గురైన శ్రీలంక 22 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్‌విల్లా 14 పరుగులు చేసి, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కుశాల్ మేండిస్ ఒక పరుగులు చేసి, దురదృష్టవశాత్తు రనౌట్‌కాగా, దిల్షాన్ మునవీర 11 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి చిక్కాడు. జట్టును ఆదుకుంటాడనుకున్న లాహిరు తిరిమానే కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. 18 పరుగులు చేసిన అతనిని శిఖర్ ధావన్ క్యాచ్ అందుకోగా హార్దిక్ పాండ్య పెవిలియన్‌కు పంపాడు. 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన లంకను ఆదుకునే బాధ్యత మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్, మిలింద సిరివర్దనపై పడింది. ఐదో వికెట్‌కు 73 పరుగులు జోడించిన తర్వాత సిరివర్దనే వికెట్ కూలడంతో లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. అతను 43 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసి హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ధోనీ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. వనిదు హసరంగ 22 బంతుల్లో 22 పరుగులు చేసి రనౌటయ్యాడు. 177 పరుగుల వద్ద లంక ఆరో వికెట్ కోల్పోయింది. జట్టుకు అండగా నిలిచి, వీరోచిత పోరాటాన్ని కొనసాగించిన ఏంజెలో మాథ్యూస్ 80 బంతుల్లో 80 పరుగులు (పది ఫోర్లు) చేసి, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ అందించి వెనుదిరిగాడు. అప్పటికి లంక స్కోరు 190 పరుగులు. ఓటమి అప్పటికే ఖాయంకాగా, మరో ఆరు పరుగులు జత కలిసి తర్వాత మలింద పుష్పకుమార (3)ను హార్దిక్ పాండ్య క్యాచ్ పట్టగా జస్‌ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. విశ్వ ఫెర్నాండో (5)ను రిటర్న్ క్యాచ్ పట్టుకొని పెవిలియన్‌కు పంపిన కుల్దీప్ యాదవ్ ఆ తర్వాతి బంతిలో మలింగను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనితో శ్రీలంక ఇన్నింగ్స్‌కు 42.4 ఓవర్లలో 207 పరుగుల వద్ద తెరపడింది. అప్పటికి అకిల దనంజయ 11 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
* టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వనే్డల్లో 29వ సెంచరీ నమోదు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అతనికి మూడో స్థానం లభించింది. సచిన్ తెండూల్కర్ 49, రికీ పాంటింగ్ 30 సెంచరీలతో కోహ్లీ కంటే ముందున్నారు. అయితే, 29 సెంచరీలు చేసేందుకు సచిన్‌కు 265, పాంటింగ్‌కు 330 ఇన్నింగ్స్ అవసరంకాగా, కోహ్లీ తన 185వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ను సాధించాడు.
* రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ 150 లేదా అంతకు మించిన భాగస్వామ్యాన్ని అందించడం ఇది ఎనిమిదోసారి. ఇలావుంటే, శ్రీలంకపై కోహ్లీ 2,000 పరుగులను పూర్తి పూర్తి చేసి, వివియన్ రిచర్డ్స్‌తో కలిసి రెండో స్థానాన్ని పంచుకుంటున్నాడు. లంకపై తక్కువ ఇన్నింగ్స్‌లోనే 2,000 పరుగులు చేసిన రికార్డు సచిన్ తెండూల్కర్ ఖాతాలో ఉంది. అతను 40 ఇన్నింగ్స్‌లోనూ ఈ ఫీట్‌ను అందుకున్నరు.
* టీమిండియా 11వ ఓవర్ ఆడుతున్నప్పుడు కోహ్లీ అర్ధ శతకాన్ని సాధించాడు. 2012లో, ఢాకాలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 16వ ఓవర్‌లో హాఫ్ సెంచరీ చేస్తే, ఇప్పుడు అంతకంటే ఐదు ఓవర్లు ముందుగానే అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు.
* టాస్ గెలిచిన గత 16 పర్యాయాల్లో కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఇది రెండోసారి. ఇంతకు ముందు, 2014లో శ్రీలంకతోనే కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇదే విధంగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు మొగ్గు చూపాడు. అదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 264 పరుగులు సాధించడం గమనార్హం.
* కెరీర్‌లో 300వ వనే్డ ఇంటర్నేషనల్ ఆడిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 42 బంతుల్లో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇటీవల కొంత కాలం ఫామ్‌ను కోల్పోయి, 2019 ప్రపంచ కప్ వరకూ అతను కొనసాగితే జట్టుకు భారంగా మారతాడని విమర్శలు ఎదుర్కొన్న ధోనీ శ్రీలంకపై అద్వితీయ ప్రతిభ కనబరుస్తున్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల్లో అతను భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు.
* రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసిన కొద్ది సేపటికే అవుట్ కావడం ఇదే మొదటిసారి. నిజానికి అతను సెంచరీ మైలురాయిని దాటిన తర్వాత ఎన్నడూ 104 పరుగులకు అవుట్ కాలేదు. అతను గత పది శతకాల్లో 120 కంటే ఎక్కువ పరుగులు సాధించడం గమనార్హం.
* శ్రీలంక సీనియర్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ కెరీర్‌లో 300వ వనే్డ వికెట్‌ను సాధించాడు. ఈ మైలురాయని చేరిన అతి కొద్ది మంది బౌలర్ల సరసన చేరాడు. అతను ఈ మ్యాచ్‌లో ఒకే వికెట్ పడగొట్టడం గమనార్హం.

చిత్రం..సెంచరీలతో చెలరేగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ