క్రీడాభూమి

సత్తా చాటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: గ్లాస్గోలో ఇటీవల జరిగకిన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం సాధించిన తెలుగు తేజం పివి సింధు, కాంస్య పతకాన్ని అందుకున్న సైనా నెహ్వాల్‌కు గురువారం క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. అదే విధంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న యువ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్, బాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, కోచ్ విమల్ కుమార్‌ను కూడా కేంద్ర మంత్రి విమల్ గోయల్ తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలపై సింధు, సైనా మరోసారి సత్తా చాటారని అన్నారు. వారు తమ పోరాట పటిమతో లక్షలాది మంది హృదయాలను గెల్చుకున్నారని గోయల్ ప్రశంసించారు. ఔత్సాహిక క్రీడాకారులకు వీరు మార్గదర్శకులవుతున్నారని అన్నారు.
జాతి గర్విస్తున్నది: వెంకయ్య
అంతర్జాతీయ రంగంలో ఉన్నత శిఖరాలకు దూసుకెళుతున్న సింధును చూసి యావత్ దేశం గర్విస్తున్నదని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. తనను మర్యాదపూర్వకంగా కలుసుకోవడానికి వచ్చిన సింధు, గోపీచంద్‌ను ఆయన ఆప్యాయంగా పలకరించారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష వంటి అత్యుత్తమ లక్షణాలతో సింధు దేశానికి ఒక గుర్తింపును తెచ్చిందని కొనియాడారారు. బాడ్మింటన్ అకాడెమీని నెలకొల్పి, ఎంతో మంది యువతీయువకులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణనిస్తున్నాడంటూ గోపీచంద్‌ను అభినందించారు.
భారత్ కూడా చైనా, జపాన్ మాదిరిగానే బాడ్మింటన్ హబ్‌గా ఎదుగుతున్నదని సింధు, సైనా, శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఎంతో మంది బాడ్మింటన్ వైపు దృష్టి సారిస్తున్నారని, అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాల నుంచి లభిస్తున్న ఆందరణ అద్వితీయమని కొనియాడారారు. ఇటీవల కాలంలో బాడ్మింట న్ మేటి జట్లకు కూడా భారత్ గట్టిపోటీని ఇవ్వగలుగు తున్నదని ఇది హర్షదాయకమని అన్నారు.

చిత్రం..న్యూఢిల్లీలో గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న (కుడి నుంచి ఎడమకు) కోచ్ విమల్ కుమార్, కిడాంబి శ్రీకాంత్, పివి సింధు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్, సైనా నెహ్వాల్, బాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్