క్రీడాభూమి

హ్యాట్రిక్‌తో పీలేని అధిగమించిన రొనాల్డో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్టో, సెప్టెంబర్ 1: వరల్డ్ కప్ సాకర్ యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో ఫారో ఐలెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ సూపర్‌స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మరోసారి అద్భుతమైన హ్యాట్రిక్‌తో సత్తా చాటుకోవడంతో పాటు ఆల్‌టైమ్ ఇంటర్నేషనల్ గోల్‌స్కోరర్ల జాబితాలో బ్రెజిల్‌కు చెందిన మాజీ దిగ్గజ ఆటగాడు పీలేని అధిగమించాడు. దీంతో పోర్చుగల్ జట్టు 5-1 గోల్స్ తేడాతో ఫారో ఐలండ్స్‌ను మట్టికరిపించి గ్రూప్-బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న స్విట్జర్లాండ్‌కు చేరువైంది. అంతర్జాతీయ మ్యాచ్‌లలో రొనాల్డో హ్యాట్రిక్ సాధించడం ఇది ఐదోసారి. తొలుత ఇన్‌సైడ్ ఏరియా నుంచి బంతిని ప్రత్యర్థుల గోల్‌పోస్టులోకి తరలించిన రొనాల్డో ఆ తర్వాత మరో రెండు అద్భుతమైన గోల్స్ సాధించడం ద్వారా ఆల్‌టైమ్ ఇంటర్నేషనల్ గోల్‌స్కోరర్ల జాబితాలో పీలే (77 గోల్స్)ని అధిగమించడంతో పాటు కెరీర్‌లో మొత్తం 78 అంతర్జాతీయ గోల్స్‌తో యూరప్‌లోని ఆల్‌టైమ్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. కాగా, సెయింట్ గాలెన్‌లో స్విట్జర్లాండ్-అండోరా జట్ల మధ్య జరిగిన మరో క్వాలిఫయింగ్ మ్యాచ్‌కి భారీ వర్షం వలన తీవ్ర అంతరాయం కలిగింది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 3-0 గోల్స్‌తో అండోరా జట్టును ఓడించి తన సత్తా చాటుకుంది.