క్రీడాభూమి

రిటైర్మెంట్ దిశగా మలింగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 1: శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగ త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ విషయాన్ని అతనే సూచనప్రాయంగా వెల్లడించాడు. టీమిండియాతో ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్ పూర్తయిన తర్వాత తన భవిష్యత్తును పరిశీలించుకుంటానని, తనలో ప్రతిభ క్షీణించినట్లు అనిపిస్తే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగే విషయమై నిర్ణయం తీసుకుంటానని అతను స్పష్టం చేశాడు. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా గురువారం ముగిసిన నాలుగో మ్యాచ్‌లో మలింగ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ను కైవసం చేసుకోవడం ద్వారా అంతర్జాతీయ వనే్డల్లో 300 వికెట్ల మైలురాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే గత 19 నెలల నుంచి కాలి గాయంతో ఇబ్బందులు పడుతూనే ఆడుతున్న తాను జింబాబ్వేతో జరిగిన సిరీస్‌తో పాటు టీమిండియాతో కొనసాగుతున్న సిరీస్‌లో సరిగా రాణించలేకపోయానని మలింగ అంగీకరించాడు. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన తర్వాత తన భవితవ్యం గురించి ఆలోచిస్తానని, ఇంకా ఎంతకాలం పాటు తాను క్రికెట్ ఆడగలనో అంచనా వేసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని మలింగ వివరించాడు. ‘నాకు ఎంత అనుభవం ఉందన్నది అనవసరమైన విషయం. శ్రీలంక జట్టును గెలిపించేందుకు అవసరమైన విధంగా ఆడలేకపోతే నేను జట్టులో కొనసాగడం అర్ధరహితమే అవుతుంది. గత 19 నెలల నుంచి సరిగా లేని నా ఫామ్‌ను వచ్చే మూడు నాలుగు నెలల్లో అయినా మెరుగుపర్చుకోగలుతానో లేదో బేరీజు వేసుకుంటా’ అని మలింగ తెలిపాడు.