క్రీడాభూమి

రెండో రౌండ్‌కు సానియా, బొపన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 1: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాతో పాటు రోహన్ బొపన్న తమతమ విభాగాల్లో శుభారంభాన్ని సాధించారు. పురుషుల డబుల్స్ విభాగంలో ఉరుగ్వే ఆటగాడు పాబ్లో కువాస్‌తో కలసి బరిలోకి దిగిన రోహన్ బొపన్న తొలి రౌండ్ పోరులో అమెరికాకు చెందిన బ్రాడ్లీ క్లాన్, స్కాట్ లిప్‌స్కీ జోడీపై అద్భుత విజయాన్ని సాధించారు. తొలి సెట్‌ను బొపన్న, కువాస్ 1-6 తేడాతో కోల్పోయినప్పటికీ అంతలోనే తేరుకుని 6-3, 6-4 తేడాతో వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకోవడం ద్వారా ప్రత్యర్థులను మట్టికరిపించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. రెండో రౌండ్‌లో వీరు ఇటలీకి చెందిన సైమన్ బొలెల్లీ, ఫాబియో ఫాగ్నినీ జోడీతో తలపడనున్నారు. కాగా, మహిళల డబుల్స్ ఓపెనింగ్ రౌండ్‌లో క్రొయేషియాకు చెందిన పెట్రా మార్టిక్, డొన్నా వెకిక్ జోడీ నుంచి ఎదురైన సవాలును సానియా మీర్జా, ఆమె భాగస్వామి షుయి పెంగ్ (చైనా) సమర్ధవంతంగా అధిగమించారు. ఈ మ్యాచ్‌లో ఒకసారి సర్వీస్‌ను కోల్పోయినప్పటికీ నాలుగుసార్లు ప్రత్యర్థుల సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా పెంగ్ మొత్తం మీద 55 నిమిషాల్లో తొలి రౌండ్ నుంచి గట్టెక్కారు. రెండో రౌండ్‌లో వీరు స్లొవేకియాకి చెందిన జనా సెపెలోవా, మగ్దలెనా రిబరికోవా జోడీతో తలపడనున్నారు.