క్రీడాభూమి

వరల్డ్ కప్ వరకూ ధోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 1: ఇంగ్లండ్‌లో జరిగే 2019 ప్రపంచ కప్‌వరకూ భారత జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగుతాడా? అనే అనుమానాలకు జట్టు హెడ్ కోచ్ రవిశాస్ర్తీ తెరదించాడు. ధోనీ కెరీర్ సగం కూడా అయిపోలేదని, 2019 ప్రపంచ కప్ వరకు అతను జట్టులో కొనసాగుతాడని స్పష్టం చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్‌డే సిరీస్‌లో ధోనీ ఆడిన మూడు మ్యాచ్‌లలోను 45, 67, 49 నాటౌట్ స్కోర్లతో అదరగొట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం రవిశాస్ర్తీ పిటిఐ వార్తాసంస్థతో మాట్లాడాడు. ‘్ధనీ ఓ దిగ్గజం లాంటి వాడు. జట్టును ప్రభావితం చేయగల వ్యక్తి. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ ఉంటే ఓ ఆభరణం ఉన్నట్లు లెక్క. అతని కెరీర్ ముగిసిందని కానీ, చివరికి సగం కూడా ముగిసిందని కానీ అనుకోవడానికి ఎంతమాత్రం వీలు లేదు’ అని రవిశాస్ర్తీ అన్నాడు. అంతేకాదు, ఎవరైనా అలా అనుకుంటే వాళ్లు పొరబాటు పడినట్లేనని, వయసు మీద పడుతున్నా ధోనీలో శక్తి సామర్థ్యాలు ఏ మాత్రం తగ్గలేదని ఆయన అన్నాడు. అంతేకాదు ధోనీ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ వన్‌డే వికెట్ కీపర్ అని కూడా రవిశాస్ర్తీ అన్నాడు. సునీల్ గవాస్కర్, సచిన్ తెండూల్కర్‌లు 36 ఏళ్ల వరకూ ఆడారని, అలాంటిది ధోనీ విషయంలో మాత్రం ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నారని ఆయన ఎదురు ప్రశ్నించాడు.
ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టు 40 వన్‌డే మ్యాచ్‌లకు పైగా ఆడుతుందని రవిశాస్ర్తీ అంటూ, ఈ మ్యాచ్‌లన్నిటినీ ప్రయోగ మ్యాచ్‌లుగానే వాడుకుంటామని చెప్పాడు. ధోనీని మినహాయించి 2019 వరల్డ్ కప్ వరకూ ఆటగాళ్లను రొటేషన్ పద్ధతిలో వాడుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశాడు. ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. ప్రపంచ కప్‌కు ఇంకా 12నుంచి 15 నెలల సమయం ఉందని, అప్పటికల్లా 18నుంచి 20 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండేలా చూస్తామని ప్రపంచ కప్ ప్రారంభయ్యే ముందు వీరిలోంచి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటామని కూడా ఆయన చెప్పాడు.
ఫిట్నెస్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కూడా రవిశాస్ర్తీ స్పష్టం చేశాడు. అత్యుత్తమ ఫీల్డింగ్ జట్టుగా ఉండాలంటే ఫిట్నెస్ ముఖ్యమని, అందుకే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పాడు. జట్టు ఎంపిక ప్రక్రియలో తాను పాలుపంచుకోనని, అది సెలెక్టర్ల పనని కూడా ఆయన చెప్పాడు. తన ఆటగాళ్లు తనపై విశ్వాసం ఉంచడం తనకు ముఖ్యమని ఆయన చెప్పాడు. ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్ ఆధారంగానే జట్టు ఎంపిక జరుగుతుందని ఆయన స్పష్టం చేశాడు. ఫిట్నెస్ కారణంగానే ప్రపంచకప్ ప్రణాళికనుంచి రైనా, యువరాజ్‌సింగ్‌లను తొలగించారా? అని అడగ్గా, అవునని చెప్పిన రవిశాస్ర్తీ, ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లందరూ వారికంటే మంచి ఫిట్నెస్‌తో ఉన్నారని కూడా చెప్పాడు. శ్రీలంక పర్యటనలో జట్టులో అందరూ ఎంతో పోరాట పటిమను కనబరిచారని, ఓడిపోయే స్థితిలో ఉండి కూడా విజయాలు సాధించారని రవిశాస్ర్తీ చెప్పాడు. ప్రపంచంలో ఎక్కడైనా గెలిచే సత్తా భారత జట్టుకు ఉందని ఆయన అన్నాడు. గత మూడేళ్ల కాలంలో జట్టు సాధించిన విజయాలే దానికి తార్కాణమని చెప్పాడు. రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారాలు ఇంగ్లండ్‌లో కౌంటీ చాంపియన్‌షిప్స్‌లో ఆడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ త్వరలో ఇశాంతిశర్మ కూడా వారితో చేరనున్నాడని చెప్పాడు. వచ్చే వేసవిలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు మరింతమంది ఆటగాళ్లు కౌంటీ సర్క్యూట్‌లో చేరాలని తాను కోరుకుంటున్నానని రవిశాస్ర్తీ చెప్పాడు.