క్రీడాభూమి

పసిడి పతకమే దీపిక లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, సెప్టెంబర్ 1: ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ టోర్నమెంట్ శనివారం నుంచి రోమ్‌లో ప్రారంభం కానుంది. గతంలో నాలుగుసార్లు రన్నరప్ టైటిళ్లు సాధించిన భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఈసారి పసిడి పతకాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రస్తుత సీజన్‌లో ఎవరు ఉత్తమ ఆర్చర్లో తేల్చేందుకు రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఈవెంట్‌లో ప్రపంచ కప్ టోర్నీలోని నాలుగు దశల్లో పోటీపడిన ఏడుగురు టాప్‌సీడ్ ఆర్చర్లతో పాటు ఆతిథ్య దేశం నుంచి మరో ఆర్చర్‌కు ప్రవేశం కల్పించారు. తొలి రోజు రోమ్‌లోని స్టేడియో డీ మార్మిలో జరిగే కాంపౌండ్ విభాగ పోటీలో భారతీయులెవరూ బరిలో లేరు. దీపికా కుమారి తలపడే తొలి రౌండ్ (క్వార్టర్ ఫైనల్) మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 2.44 నిమిషాలకు ప్రారంభమవుతుంది.