క్రీడాభూమి

వేన్ రూనీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 1: ప్రముఖ ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు వేన్ రూనీని మద్యంమత్తులో డ్రైవ్ చేస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం చెప్పారు. ఇంగ్లండ్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్ అయిన రూనీ అత్యధిక గోల్స్ చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 119 మ్యాచ్‌లలో 59 గోల్స్ చేసిన రూనీ గత వారమే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌నుంచి రిటైర్మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు 13 ఏళ్ల పాటు సేవలందించిన రూనీ తన చిన్ననాటి క్లబ్ అయిన ఎవర్టన్‌లో తిరిగి చేరాడు.