క్రీడాభూమి

ఓల్ట్‌మన్స్‌కు ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: జాతీయ హాకీ జట్టు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్‌కు హాకీ ఇండియా శనివారం ఉద్వాసన పలికింది. విజయాలకోసం ఆయన ప్రతిపాదించిన దీర్ఘకాలిక ప్రక్రియపై తమకు నమ్మకం లేకపోవడమే ఆయనను కోచ్ పదవినుంచి తప్పించడానికి కారణంగా హాకీ ఇండియా పేర్కొంది. ఓల్ట్‌మన్స్‌ను తక్షణం కోచ్ పదవినుంచి తప్పించినట్లు ప్రకటించిన హాకీ ఇండియా ఆయన స్థానంలో తగిన వ్యక్తి లభించే వరకు హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్‌ను జాతీయ పురుషుల హాకీ జట్టుకు ఇన్‌చార్జిగా ప్రకటించింది. హాకీ ఇండియాకు చెందిన హైపెర్ఫార్మెన్స్, డెవలప్‌మెంట్ కమిటీ మూడు రోజుల సమీక్షా సమావేశం తర్వాత ఓల్ట్‌మన్స్‌ను తొలగించాలనే నిర్ణయనికి హాకీ ఇండియా వచ్చింది. ‘ఓల్ట్‌మన్స్ తన దీర్ఘకాలిక విజన్‌కు సంబంధించి అనేక ప్రజంటేషన్లు ఇచ్చారు. అయితే మాకు తక్షణ ఫలితాలు కావాలి. 2012నుంచి కూడా మనకు చాలా మంది ప్రాబబుల్స్ ఉన్నారు. అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమైనాము’ అని హాకీ ఇండియా హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్ చెప్పాడు. ‘మాకు నిలకడ కావాలి. అంతర్జాతీయ పోటీల్లో టాప్ త్రీలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. కామనె్వల్త్ గేమ్స్, వచ్చే ఏడాది ప్రపంచ కప్, 2020 ఒలింపిక్స్‌లో కూడా పతకాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అని ఆయన చెప్పాడు.
హాలండ్‌కు చెందిన ఓల్ట్‌మన్స్ 2013 జనవరిలో హైపెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా భారత జట్టులో చేరాడు. ఆ తర్వాత పాల్ వాన్ ఆస్‌ను కోచ్ పదవినుంచి తప్పించిన తర్వాత 2015 జూలైలో కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఓల్ట్‌మన్స్ గత రెండు రోజులుగా తన ప్రజంటేషన్ ఇచ్చారని, అయితే జట్టుకు ఇప్పుడు కొత్త దిశ అవసరమని కమిటీ భావించిందని జాన్ చెప్పాడు.
కాగా, హాకీ జట్టు ఫిట్నెస్, సమన్వయం పెంచడంలో ఓల్ట్‌మన్స్ పాత్ర బాగున్నా అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు, నిలకడ లోపం ఎక్కువగా ఉన్నట్లు భావించినట్లు హాకీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 2016, 2017లో జట్టు ప్రదర్శన మాగానే ఉన్నా ఆసియా కప్ గెలవడమే బెంచ్‌మార్క్ కాదని కమిటీ అభిప్రాయ పడినట్లు హాకీ ఇండియా సెలెక్షన్ కమిటీ చైర్మన్ హర్బిందర్ సింగ్ చెప్పాడు. కాగా, భారత జట్టులో చేరిన రోజునే తాను ఎప్పుడో ఒక రోజు తప్పుకోవలసి వస్తుందని అనుకున్నానని, అయితే ఇంత హటాత్తుగా జరుగుతుందని మాత్రం అనుకోలేదని ఓల్ట్‌మన్స్ అన్నాడు.