క్రీడాభూమి

భారత జట్టుకు ధావన్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 2: ఐదు వనే్డల క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరిగే చివరి మ్యాచ్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఏకైక అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌కి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అందుబాటులో ఉండటం లేదు. ధావన్ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతను శ్రీలంక నుంచి స్వదేశానికి బయలుదేరాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, అనారోగ్యం నుంచి కోలుకుంటోందని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి పేర్కొన్నట్లు బిసిసిఐ ఆ ప్రకటనలో తెలిపింది. చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న శిఖర్ ధావన్ శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో అత్యధిక పరుగులు రాబట్టుకోవడంతో పాటు తొలి వనే్డ మ్యాచ్‌లో 132 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. అయితే శ్రీలంతో ఇక కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో ధావన్‌కు బదులుగా జట్టులోకి మరెవరినీ తీసుకోరాదని భారత సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది. బ్యాకప్ ఓపెనర్లుగా లోకేష్ రాహుల్, అజింక్య రహానే ఇప్పటికే భారత జట్టుకు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం.