క్రీడాభూమి

తల్లి అయిన సెరెనా విలియమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, సెప్టెంబర్ 2: టెన్నిస్ సూపర్‌స్టార్ సెరెనా విలియమ్స్ తల్లి అయింది. ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. దీంతో సెరెనాకు అభిమానులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెలాఖరులో 36వ పడిలో ప్రవేశించనున్న సెరెనా విలియమ్స్ తొలి కాన్పు కోసం బుధవారం వెస్ట్ పామ్ బీచ్ (్ఫ్లరిడా)లోని సెయింట్ మేరీస్ మెడికల్ సెంటర్‌లో చేరింది. అయితే సెరెనాకి బిడ్డ పుట్టిన విషయాన్ని ఆమె ప్రతినిధులు ధ్రువీకరించలేదు. కానీ ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చిందన్న వార్త తెలిసి తాను ఎంతగానో సంతోషిస్తున్నానని సెరెనా సోదరి వీనస్ విలియమ్స్ తెలిపింది. యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నమెంట్‌లో మూడో రౌండ్ మ్యాచ్ ఆడటానికి ముందు వీనస్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ అంశంపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ఆమె తిరస్కరించింది. ‘టెన్నిస్ గురించి మీరు ఎటువంటి ప్రశ్నలు అడిగినా సమాధానమిస్తా. అంతేతప్ప ప్రస్తుతానికి మరే విషయం గురించి మాట్లాడను’ అని వీనస్ విలియమ్స్ స్పష్టం చేసింది.