క్రీడాభూమి

ప్రయోగాలకు భారత్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో ‘పసికూన జట్టు’ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ను ఢీ కొంటున్న భారత్ ప్రయోగాలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ టోర్నీ ఫైనల్ చేరిన కారణంగా, గురువారం నాటి మ్యాచ్ ఫలితం వల్ల టీమిండియాకు ప్రత్యేకించిన లాభనష్టాలేవీ ఉండవు. ఈ టోర్నీలో ఆడిన తుది జట్లలో స్థానం సంపాదించుకోలేకపోయిన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భారత జట్టు మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్టు సమాచారం. వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, టి-20 వరల్డ్ కప్ పోటీలకు వామప్ టోర్నీ కావడంతో అతను ఈటోర్నీకి కూడా ప్రాధాన్యతనిచ్చాడు. ఫైనల్ చేరేందుకు అవసరమైన కీలక మ్యాచ్‌ల్లో ఆడాడు. యుఎఇతో జరిగే మ్యాచ్‌కి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో, అతను విశ్రాంతి తీసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ధోనీ బరిలోకి దిగకపోతే, ఇప్పటి వరకూ అతనికి స్టాండ్‌బైగా ఉన్న పార్థీవ్ పటేల్‌కు జట్టులో అవకాశం లభించవచ్చు. టి-20 ఫార్మెట్‌లో ఓపెనర్‌గా కూడా రాణిస్తున్న పార్థీవ్ రెగ్యులర్‌గా నెట్స్‌కు హాజరవుతున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే అతను ఆడతాడన్న అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ, సాధారణంగా ప్రయోగాలకు ఇష్టపడని ధోనీ తానే స్వయంగా మైదానంలోకి దిగాడు. ఇప్పుడు లంకను ఓడించిన భారత్ ఫైనల్ చేరడంతో అతను యుఎఇ మ్యాచ్‌లో పార్థీవ్‌ను తీసుకోవచ్చని అంటున్నారు.
ప్రయోగాలు చేస్తాం: ధోనీ
యుఎఇతో గురువారం జరిగే మ్యాచ్‌లో ప్రయోగాలు చేస్తామని ధోనీ స్పష్టం చేశాడు. అయితే, ఎంత మందికి కొత్తగా తుది జట్టులో స్థానం లభిస్తుందనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్ల శక్తిసామర్థ్యాలను పరీక్షించుకోవడంతోపాటు, ఫామ్‌ను కొనసాగించాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని చెప్పడం ద్వారా భారీ మార్పులు లేకపోవచ్చన్న సంకేతాలు ఇచ్చాడు. యువ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసల్లో ముంచెత్తాడు. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో, యువ బౌలర్లు అద్భుత ప్రతిభ కనబరచడం ఎంతో సంతృప్తినిస్తున్నదని ధోనీ అన్నాడు.
కాగా, టీమిండియా ప్రయోగాలు చేస్తే మొదటి మార్పుగా ఆజింక్య రహానే పేరు వినిపిస్తున్నది. బౌన్సీ వికెట్స్‌పై ఆడేందుకు ఇబ్బంది పడుతున్న శిఖర్ ధావన్ స్థానంలో అతనిని తీసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అతనికి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అకాశం లభించింది. అయితే తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. మహమ్మద్ అమీర్ వేసిన అలాంటి అద్భుతమైన బంతిని ఆడడం ఎంతటి సమర్థుడైన బ్యాట్స్‌మన్‌కైనా సాధ్యం కాదని పరిశీలకులు అంటున్నారు. అతనికి మరో అవకాశం లభించాలని చెప్తున్నారు.
ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా 37వ పుట్టిరోజు వేడుకను త్వరలోనే జరుపుకోనున్నాడు. వయసును లక్ష్య పెట్టకుండా యువకులతో పోటీపడుతూ చక్కటి ప్రతిభతో రాణిస్తున్నాడు. అయితే, యుఎఇ మ్యాచ్ నుంచి అతనికి విశ్రాంతినివ్వడం ద్వారా, అలసిపోకుండా ఉండాలి. అతనికి విశ్రాంతినిస్తే, భువనేశ్వర్ కుమార్ ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వస్తాడు. అదే విధంగా రవీంద్ర జడేజా స్థానంలో పవన్ నేగీ లేదా హర్భజన్ సింగ్‌లో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. శ్రీలంకపై రాణించిన యువరాజ్ సింగ్‌ను గురువారం నాటి మ్యాచ్‌లోనూ ఆడించవచ్చు.
పోరాటాల జట్టు యుఎఇ
అన్ని రంగాల్లోనూ పటిష్టంగా ఉన్న భారత్ గురువారం నాటి మ్యాచ్‌లో ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, యుఎఇని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అంజద్ జావేద్ నాయకత్వంలోని ఈ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ తీవ్రంగా పోరాడుతున్నది. పరాజయాలను ఎదుర్కొన్నా, చివరి క్షణం వరకూ గట్టిపోటీనిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నది. భారత్‌పై యుఎఇ విజయాన్ని ఎవరూ ఊహించడం లేదు. కానీ, ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే మాత్రం టీమిండియాకు ఇబ్బందులు తప్పవు.

ప్రో కబడ్డీలో ఏకపక్ష మ్యాచ్
పునేరీ చేతిలో బెంగాల్ చిత్తు

ముంబయ: ప్రో కబడ్డీలో భాగంగా బుధవారం ఏక పక్షంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పునేరీ పల్టన్ చేతిలో బెంగాల్ వారియర్స్ జట్టు 19-43 తేడాతో చిత్తయంది. పునేరీ ఆటగాళ్ల వి జృంభణను సమర్థంగా ఎదుర్కోలేకపోయన బెంగాల్ ఆటగాళ్లు ప్రేక్షకపాత్ర పోషించాల్సి వచ్చింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వవరకూ పునేరీ ఆధిపత్యం కొనసాగింది. దీపక్ నివాస్ 13 పా యం ట్లు సాధించి ఈ జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. సుజీత్ 9, నీలేష్ సలాంకే 5 చొప్పున పాయంట్లు చేశారు. బెంగాల్ ఆటగాళ్లలో మహేంద్ర గణేష్ రాజ్‌పుత్ అత్యధికంగా 6 పాయంట్లు సాధించాడు. జంగ్ కున్ లీ 4, నిలేష్ షిండే 3 చొప్పున పాయంట్లు రాబట్టారు. మొత్తం మీద 24 పా యంట్ల భారీ ఆధిక్యంతో గెలిచిన పునేరీ పాయంట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ జట్టు ఖాతాలో 48 పాయంట్లు ఉన్నాయ. బెంగాల్ 47 పాయంట్లతో నాలుగో స్థానంలో ఉంది.
దబాంగ్ ఢిల్లీని ఓడించిన యుముంబా
మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిలీలని యుముంబా 36-20 తేడాతో ఓడించింది. బుధవారం నాటి మొదటి మ్యాచ్ మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా దాదాపుగా ఏకపక్షంగానే సాగింది. యుముంబా ఆ టగాడు రిషాంగ్ దేవాడిగ 8 పాయంట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అనూప్ కుమార్ 7 పాయం టుల సాధించాడు. దబాంగ్ ఢిల్లీ తరఫున సెల్వమణి (6 పాయంట్లు) ఒక్కడే రాణించగలిగాడు. మి గతా వారంతా విఫలం కావడంతో ఆ జట్టుకు 16 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.